-పోలీస్ అధికారులు శత శాతం నిబద్ధతతో పనిచేసి, పార్టీలకు, కులాలకు మతాలకు అతీతంగా విధులు నిర్వర్తించాలని, భావితరాలకు మంచి పాలన అందించాలంటే ఎన్నికలు పారదర్శకంగా నిష్పాక్షికంగా నిర్వహించే ప్రశాంత వాతావరణం కల్పించాలి
-ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు నిబంధనల మేరకు చేపట్టాలి: భారత ఎన్నికల కమిషన్ ప్రతినిధి మరియు సార్వత్రిక ఎన్నికల రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకులు దీపక్ మిశ్రా
-ప్రశాంత వాతావరణంలో నిష్పాక్షిక పారదర్శక ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నాం: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
-శాంతి భద్రతల నిర్వహణతో ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేలా చర్యలు చేపడుతున్నాం : ఎస్పి కృష్ణ కాంత్ పటేల్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాస్వామ్య ఎన్నికల విధులు నిర్వహణలో పాల్గొనడం ఎంతో గొప్ప సదవకాశమని, నిష్పాక్షిక పారదర్శక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని విధాల పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎలాంటి హింసాత్మక, రీ పోల్ ఘటనలకు తావివ్వకుండా ఎన్నికల మార్గదర్శకాల మేరకు అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు నిబంధనల మేరకు తీసుకోవాలని భారత ఎన్నికల కమిషన్ ప్రతినిధి మరియు సార్వత్రిక ఎన్నికల రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకులు దీపక్ మిశ్రా పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం తిరుపతి జిల్లాకు భారత ఎన్నికల కమిషన్ నుండి ఆం.ప్ర రాష్ట్రానికి కేటాయించబడిన రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకులు తిరుపతి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేపడుతున్న చర్యలపై, సన్నద్ధతపై జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, ఎస్పి కృష్ణ కాంత్ పటేల్ సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించి మాట్లాడుతూ ప్రజాస్వామ్య ఎన్నికల విధుల నిర్వహణలో పాల్గొనడం ఎంతో గొప్ప అవకాశమని, నిష్పాక్షిక పారదర్శక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పి అన్ని రకాల చర్యలు ప్రణాళికా బద్ధంగా ఎలక్షన్ కమిషన్ టైం లైన్ మేరకు, నిబంధనల మేరకు చేపడుతున్నారని అన్నారు. ఎలాంటి హింసాత్మక, రీ పోల్ ఘటనలకు తావివ్వకుండా ఎన్నికల మార్గదర్శకాల మేరకు అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని సూచించారు.
పోలీస్ అధికారులు శత శాతం నిబద్ధతతో పనిచేసి, పార్టీలకు, కులాలకు మతాలకు అతీతంగా విధులు నిర్వర్తించాలని, భావితరాలకు మంచి పాలన అందించాలంటే ఎన్నికలు పారదర్శకంగా నిష్పాక్షికంగా నిర్వహించాలని, స్వేచ్ఛాయిత వాతావరణంలో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పోలింగ్ రోజున మే 13న తమ ఓటు హక్కును వినియోగించుకునేలా శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక, వల్నరబుల్ పోలింగ్ కేంద్రాలపై సమీక్షించుకుని తగు చర్యలు చేపట్టాలని అన్నారు. అక్రమ మద్యం, నగదు, డ్రగ్స్ తదితరాలు రవాణా, పంపిణీ జరగకుండా చెక్ పోస్టుల వద్ద తనిఖీలు, వివిధ తనిఖీ బృందాలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే అట్టి వారిపై గట్టి కఠిన చర్యలు నిబంధనల మేరకు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో నిష్పాక్షిక పారదర్శక ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం: జిల్లా కలెక్టర్
సమావేశంలో భాగంగా ముందుగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిష్పాక్షికంగా పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యల గురించి రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకులకు వివరించారు. జిల్లాలో 2130 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఆగ్జిలరీ పోలింగ్ కేంద్రాలు 10 కలిపి మొత్తం 2140 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని,పోలింగ్ స్థానాలు 1387 ఉన్నాయని అందులో 696 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, 15 వల్నరబుల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. 8 చోట్ల అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులు, 6 అంతర్ జిల్లాల చెక్ పోస్టులు, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు 2 ఏర్పాటుతో, ఎస్ఎస్టి, ఎఫ్ఎస్టీ, జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ బృంద ఏర్పాటుతో విసృత తనిఖీలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటి వరకు నగదు, మద్యం, ఫ్రీబిలు, విలువైన లోహాలు వంటివి అన్నీ కలిపి వెరసి మొత్తం 20.28 కోట్ల విలువైన వాటిని సీజ్ చేశామని ఈఎస్ఎంఎస్ నందు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. బూదనం టోల్ ప్లాజా, చిల్లకూరు వద్ద బంగారం 66.119 కేజీలు, నగదు 48 లక్షలు కలిపి మొత్తం రూ. 15.39 కోట్లు సిజ్ చేయడం జరిగిందని తెలిపారు. వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు 24X7 క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నాయని, నగదు తరలింపు, మద్యం రవాణాపై నిఘా ఉంచుతున్నాయన్నారు. 24*7 పని చేసేలా కంట్రోల్ రూమ్ నుంచి సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుండి వెపన్స్ కు సంబందించి 505 ఉంటే 503 డిపాజిట్ చేయించామని మిగిలిన రెండు లైసెన్సులు రద్దు చేసామని తెలిపారు. ఎన్నికలకు కేటాయించిన కేంద్ర బలగాలను అన్ని నియోజకవర్గాలకు కేటాయించడం జరిగిందని తెలిపారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ పెంచల కిషోర్, పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News