Breaking News

మే 7 మరియు 8 తేదీలలో ఫెసిలిటేషన్ కేంద్రం నందు పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి అనుమతి…

-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
అనివార్య పరిస్థితుల కారణంగా ఎన్నికల విధుల్లో ఉన్న ఓటరు 1 మే 2024లోపు ఫారమ్-12ను సమర్పించలేకపోయినట్లైతే, ఏ ఆర్వో పరిధిలో ఆ ఉద్యోగి ఓటరుగా నమోదు అయ్యారో, ఆ ఆర్వో కు ఫారం 12 సమర్పించేందుకు మరియు ఆ నియోజక వర్గ ఫెసిలిటేషన్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు అనుమతించాలని, సదరు డ్యూటీ ఆర్డర్ ప్రతిని పరిశీలించి, సదరు వ్యక్తి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోకుంటే వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు అనుమతించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

ఈ నెల 7 మరియు 8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇది వరకే ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాలు పని చేస్తాయని ఆయన తెలిపారు. ఉద్యోగులకు మంజూరు చేసిన స్పెషల్ క్యాజువల్ లీవ్ ను సద్వినియోగం చేసుకుంటూ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ సెంటర్లో ఓటు హక్కు అవకాశాన్ని వినియోగించుకోవచ్చు అన్నారు.

ECI మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత గడువులోగా ఎన్నికల విధుల్లో ఉన్న అర్హులైన ఓటర్లందరి ఓటు హక్కును తప్పకుండా సద్వినియోగం చేసుకునేలా ఆర్వోలు అందరూ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఓటర్ల వివరాలు, అపాయింట్‌మెంట్ ఆర్డర్ యొక్క నిర్ణీత ధృవీకరణ తర్వాత మరియు పోస్టల్ బ్యాలెట్ ఇప్పటికే జారీ చేయబడలేదని నిర్ధారించుకున్న తదుపరి ఓటు హక్కును వినియోగించుకోవడానికి అనుమతించాలని ఆర్వోలకు ఆయన సూచించారు. ECI మార్గదర్శకాల అమల్లో ఎలాంటి అలసత్వం ఉండరాదని అన్నారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *