Breaking News

హోమ్ ఓటింగ్ కు సర్వం సిద్ధం

-అంగీకారం తెలియజేసిన 1052 మందికి హోమ్ వోటింగ్
-జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీ రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఈనెల 7, 8వ తేదీ మంగళ బుధవారాలలో హోమ్ ఓటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు అన్నారు. జిల్లాలో ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ఓటింగ్ శాతం పెంచవచ్చని, ఈ కార్యక్రమంలో భాగంగా కదలలేని పరిస్థితిలో ఉన్న వృద్దులు, విభిన్న ప్రతిభావంతులకు ” హోమ్ ఓటింగ్” విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టామన్నారు. హోమ్ ఓటింగ్ కు జిల్లాలో 1052మంది అంగీకారం కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరికి ఈ నెల 7, 8 వ తేదీ మంగళ, బుధ వారాల్లో ఎన్నికల సిబ్బంది ” హోమ్ ఓటింగ్” కు దరఖాస్తు చేసుకున్న వారి ఇంటి వద్దకు వెళ్లి హోమ్ ఓటింగ్ కు చర్యలు తీసుకుంటారన్నారు. ఇందుకు సంబంధించి ఓటర్లకు ముందుగానే సమాచారం ఇచ్చామన్నారు. హోమ్ వోటింగ్ విధానంలో సెక్టోరల్ ఆఫీస్, మైక్రో అబ్జర్వర్ , పోలింగ్ బూత్ అధికారి, ఆర్మ్డ్ సిబ్బంది, వీడియోగ్రాఫర్ ఉంటారని, వోటింగ్ ప్లాటుఫారం ఏర్పాటుచేసి, వోటింగ్ విధానం పూర్తి సీక్రెట్ ఓటింగ్ గా జరిగేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గం లో 85 సంవత్సరాలు పైబడిన 210 మంది ఓటర్లు, 94 మంది పిడబ్ల్యుడి ఓటర్లు,

విజయవాడ వెస్ట్ నియోజవర్గ పరిధిలో 85 సంవత్సరాలు పైబడిన 67 మంది, 36 మంది పిడబ్ల్యుడి ఓటర్లు,

విజయవాడ సెంట్రల్ నియోజవర్గ పరిధిలో 85 సంవత్సరాలు పైబడిన 117 మంది, 74 మంది పీడబ్ల్యుడి ఓటర్లు,

తిరువూరు నియోజవర్గంలో 85 సంవత్సరాలు పైబడినవారు 70 మంది, 60 మంది పీడబ్ల్యుడి ఓటర్లు,
మైలవరం నియోజకవర్గంలో 85 సంవత్సరాలు పైబడిన 48 మంది, 17 మంది పిడబ్ల్యుడి ఓటర్లు,

నందిగామ నియోజకవర్గంలో 85 సంవత్సరాలు పైబడిన 49 మంది ఓటర్లు, 60 మంది పిడబ్ల్యుడి ఓటర్లు హోమ్ ఓటింగ్ కు అంగీకారం తెలిపారన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *