-వరుస సంఘటనలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు మహిళా కమిషన్ లేఖ..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికలలో ఓడిపోతామని భయంతో టిడిపి కూటమి నాయకులు మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని గజ్జల వెంకటలక్ష్మి చైర్ పర్సన్ మహిళా కమిషన్ అన్నారు. సాక్షాత్తు హోం మంత్రి తానేటి వనితపై దాడికి ప్రయత్నించడం దళితులు, మహిళలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. దళిత మహిళ తానేటి వనిత పై దాడి దళితుల పట్ల చంద్రబాబు వైఖరిని తెలియజేస్తుందన్నారు. మహిళలపై టిడిపి ఆగడాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. విజయవాడలో బోండా ఉమా కుమారుడు మహిళలపై దాడి, ఎమ్మెల్యే బాలినేని వాసు కోడలిపై దాడి, మంత్రి అంబటి రాంబాబు, ముద్రగడ కుమార్తెల పేరిట రాజకీయం, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణిపై దాడి. దళితులు అవమానపడేలా,
మహిళలకు వచ్చే ఆసరా, చేయూత పథకాలు అందకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. అవ్వ తాత లకు పెన్షన్ ఆలస్యం అయ్యేలా చంద్రబాబు చేస్తున్నాడు. 2019లో టిడిపికి ప్రజలు బుద్ధి చెప్పారు. 2024 లో టిడిపి కూటమికి మహిళలు తగిన గుణపాఠం చెప్తారన్నారు.
Prajavartha Online Telugu News