-ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ పనుల్ని నెలాఖరులోగా పూర్తి చేయండి
-క్రిటికల్ కేర్ బ్లాకుల పనుల్ని వేగవంతం చెయ్యండి
-అధికారులకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా తలసీమియా రోగులకు అందించాల్సిన సేవలపై సమగ్ర విధానాన్ని తయారు చేయాలని ఆర్బీఎస్కే పీవో డాక్టర్ ప్రశాంత్ ను ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. డిఐఇసి సెంటర్లలో తలసీమియా రోగుల పూర్తి వివరాల్ని అందజేయాలన్నారు. అలాగే తలసీమియా పింఛన్లు తీసుకుంటున్న రోగుల వివరాల్ని కూడా అందజేయాలని నోడలాఫీసర్ (సెకండరీ హెల్త్ డైరెక్టరేట్) డాక్టర్ సుజాతను ఆదేశించారు. తలసీమియా విషయంలో ఏమేమీ చేయగలమో ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని, అందుకోసం ఈ సమాచారాన్నంతా క్రోడీకరించుకోవాల్సిన అవసరముందని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ప్రాస్ట్రక్చర్ మిషన్ (PMABHIM) కింద రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబులు(IPHLs), తలసీమియా, హిమోఫిలియా తదితర అంశాలపై మంగళగిరిలోని ఎపిఐఐసి టవర్స్‌లోని 5వ ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నాడు కమీషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిసిహెచ్ఎస్లు, జిల్లా, ఏరియా ఆసుపత్రుల మెడికల్ సూపరింటెండెంట్లు, ఎపిఎంఎస్ ఐడిసి ఇడి సిహెచ్ అనురాధ , సిఇ సుధాకర్ రెడ్డి, డ్రగ్స్ జిఎం సురేష్ వర్చువల్ గా పాల్గొనగా, నేషనల్ హెల్త్ మిషన్ ఎస్పిఎం డాక్టర్ దుంపల వెంకట రవికిరణ్, సిఎవో గణపతిరావు, ఎన్యుహెచ్ఎం స్టేట్ నోడలాఫిసర్ విజయలక్ష్మి, బ్లడ్ బ్యాంకుల జెడి(ఎపిశాక్స్) డాక్టర్ కామేశ్వరరావు తదితరులు సమీక్షా సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఏపీలోని 13 ఐపిహెచ్ఎల్ల ఏర్పాటుకు సంబంధించి సివిల్ మరియు ఎలక్ట్రికల్ పనుల్ని నెలాఖరుకల్లా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకోవాలని ఆదేశించారు. అలాగే వీటిలో నిర్దేశిత 120 టెస్టుల్ని చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని, అవసరమైన రియేజంట్స్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 14 క్రిటికల్ కేర్ బ్లాకుల పనుల్ని కూడా వేగవంతం చేయాలని కమీషనర్ ఆదేశించారు. ఐపిహెచ్ ఎల్లలో ఫుల్లీ ఆటోమెటిక్ అనలైజర్ల ను పది రోజుల్లోగా సిద్ధం చేసుకుని డెమో కూడా నిర్వహించాలన్నారు. అలాగే వాటిలోని పరికరాల వారీగా రియేజెంట్లను సరఫరా చేయాలని ఆయన సూచించారు. రియేజెంట్స్ వినియోగం విషయంలో కూడా స్పష్టత ఉండాలని, ఎంత వాడుతున్నారు, ఎంత మిగులుతోంది వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ద్వారా వేస్టేజ్‌ను అరికట్టాలని సూచించారు. 13 చోట్ల నెలకొల్పిన ఐపిహెచ్ఎల్ ల డిజైన్లు, సైన్ బోర్డులు ఒకేలా ఉండేలా చూసుకోవాలన్నారు. 5 ఐపిహెచ్ ఎల్ లలో ఇంకా పెండింగ్ లో ఉన్న సివిల్, ఎలక్ట్రికల్ పనుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కమీషనర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు.
Prajavartha Online Telugu News