విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ వంతంగా తీర్చిదిద్దుతానని బిజెపి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరి పేర్కొన్నారు .ఇంతకాలం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని ఆయన అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో గురువారం సుజనా చౌదరి తో మీట్ ది ప్రెస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కంచల జయరాజు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సుజనా చౌదరి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా చేయటానికి తగిన ప్రణాళిక తన దగ్గర ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అధ్యయనం చేశానని, అన్ని వర్గాల ప్రజల స్థితిగతులు తనకు అవగాహన అయ్యాయని వాటిని పూర్తిస్థాయిలో పరిష్కరించడానికి తగిన ప్రణాళిక తన దగ్గర ఉందని సుజనా చౌదరి పేర్కొన్నారు.
మత ప్రాతిపదికన, కులపాతి ప్రతిఘటన ఎవరు గెలుస్తారని అన్ని రాజకీయ పార్టీలు వస్తున్నాయని ఆయన అన్నారు. నియోజకవర్గంలో తిరిగాక తన మనసు కలిసి వేసిందని, కళ్ళు తెరుచుకున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ సంకల్పం కలిగిన పొలిటీషియన్లు ఇప్పుడు కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి దిశగా అమరావతి బ్లూ ప్రింట్ తయారు చేశారని ఆయన అన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలని కక్ష సాధింపు రాజకీయాలు ఇప్పుడు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. పోలవరం రివర్స్ టెండర్రింగ్ చేసి ఆపేశారని ఆయన విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గంలో తాగునీటి వసతి కూడా కనిపించడం లేదని ఆయన అన్నారు. ఇక్కడ మంత్రిగా పనిచేసిన వ్యక్తికి సీఎం తర్వాత ఈ నియోజకవర్గంలో నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని అన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆలస్యంగా వచ్చానని అయిన తనకున్న పరపతి పలుకుబడిన ఉపయోగించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.. నా జీవనం మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే ఉందని స్థానికత్వం గురించి మాట్లాడితే నేను స్థానికుడిని అయిపోతానని ఆయన అన్నారు మహానటి సావిత్రి కి మా తాత గారి ఇల్లు అమ్మారు ప్రకాశం బ్యారేజ్ కి ఇంజనీర్గా మా నాన్నగారు పని చేశారు.. ప్రజా అవసరాలు ఏవి కూడా పశ్చిమంలో సరిగా ఏర్పాటు చేయలేదు.. పశ్చిమంలో రూపురేఖలు మార్చేయడానికి కావలసిన ప్రణాళిక నా దగ్గర ఉంది.. కనకదుర్గమ్మ ఆలయం తిరుపతి స్థాయిలో అభివృద్ధి చేస్తా అని సుజనా చౌదరి పేర్కొన్నారు. కమలం గుర్తుకి సైకిల్ గుర్తుకి ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. అభ్యర్థుల అనుభవం చూడండి అభ్యర్థులను పోల్చుకొని చూడండి అని ఆయన ఓటర్లకు సూచించారు. పోలవరం 2019 నాటికి 79% పూర్తయిందని నాలాంటి ఇంజనీర్ కు ఇస్తే 24 నెలల్లో పూర్తయిపోయేదని ఆయన పేర్కొన్నారు. నాలెడ్జ్ లేకుండా సమాచారం మాత్రమే తీసుకొని పాలనకు వస్తే ఎలాగే జరుగుతుందని ఆయన అన్నారు. గంజాయి బ్లేడ్ బ్యాచుల నిర్మూలించడానికి పూర్తిస్థాయిలో కంకణం కట్టుకున్నట్లు సుజనా చౌదరి తెలిపారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అంటే ఒక గుర్తుగా, ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలని ఆదర్శంగా పనిచేస్తానని ఆయన తెలిపారు.. స్పెషల్ కేటగిరి స్టేటస్ అనేది ఒక బ్రహ్మ పదార్థంలో చూపించినట్లు ఆయన తెలిపారు. మన ఏపీ 22 మంది ఎంపీలు ఏ రోజు రాష్ట్ర అభివృద్ధి గురించి పార్లమెంట్లో మాట్లాడలేదని ఆయన ఎద్దేవా వేశారు.. బిజెపి ఎంత చేసినా ఏ రోజు చెప్పుకునే ప్రయత్నం చేయలేదని ఆయన అన్నారు. బిజెపి కాంగ్రెస్ కలిసే రాష్ట్ర విభజన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మద్రాసు నుంచి విడిపోయిన పరిస్థితులు పునరావతం కాకూడదని హైదరాబాదును పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. చంద్రబాబు చెప్పాడని రాష్ట్ర విభజన జరగలేదు అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు .చంద్రబాబు తనకు రాజకీయాల్లో అ ఆ లు నేర్పిన గురువేరని ఆయన అంగీకరించారు. నేను రాజకీయాల్లో నుంచి బయటకు వెళుతుంటే ఆపిన వ్యక్తి అరుణ్ జెట్లీ అని గుర్తు చేసుకున్నారు. తనమీద భారతదేశంలో గానీ ఎక్కడా కూడా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆయన అన్నారు. తన రాజకీయ జీవితం టిడిపిలో మొదలైందని బిజెపిలోకి వచ్చాక బిజెపి సిద్ధాంతాలను ఆకర్షించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలను మోసం చేసే యాక్టుగా ఆయన అభివర్ణించారు. తన ఫోటోను ల్యాండ్ టైటిల్ ఆక్ట్ విషయంలో సోషల్ మీడియాలో పెట్టి యాంటీ సోషల్ మీడియా లాగా వాడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. విజయవాడ తన నియోజకవర్గం లో కూడా పట్టాలి చేశారని తెలియక ఇచ్చేశారు అనుకుంటా అని ఆయన అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు అసలు అర్థమే లేదు అనే విషయాన్ని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అప్పులు మయం చేశారని చంద్రబాబు సీఎం అయితే అది ముళ్ళ కిరీటమే అవుతుందనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో అనేక అంశాలు ఉన్నాయని అనేక ప్రజా సమస్యలు ఉన్నాయని అదే విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో కూడా అనేక అంశాలు ఉన్నాయని వాటిని ప్రణాళిక అబద్ధంగా పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు .ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, విజయవాడ యూనిట్ అధ్యక్షుడు చావా రవి, ఐజె యు సభ్యులు ఎస్కే బాబు సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News