Breaking News

జాతీయ భావజాలంతో సాగుతున్న సాయిరాం ప్రచారం

-సుజనా గెలుపు కోసం తపన
-పశ్చిమంలో ఎండల్లో సాగుతూ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆయన ఒకప్పుడు కరడు గట్టిన వైసిపి నాయకుడు అయితే జాతీయ భావజాలం మెండుగా ఉన్న వ్యక్తి. అందుకే ప్రధాని మోడీ పై ఉన్న అభిమానంతో బీజేపీ లో చేరారు. సైకిల్ కు బీజేపీ జెండాలు కట్టుకుని పశ్చిమ నియోజకవర్గం లో పేర్ల సాయిరాం కమలం గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ ప్రజలను చైతన్య పరుస్తూ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తన సైకిల్ మీదే ప్రయాణం కొనసాగిస్తూ సుజనా చౌదరి గెలుపు కోసం కృషి చేస్తున్నారు .కరుడు కట్టిన వైకాపా పార్టీ నాయకునిగా ఉన్న పేర్ల సాయిరాం ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకు వైకాపాలో కొనసాగారు జాతీయ భావజాలంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ మీద ఉన్న అభిమానంతో సుజనా చౌదరి గెలుపే లక్ష్యంగా ఆయన సమక్షంలో భాజపాలో చేరి భారత్ మాతాకీ జై అంటూ ప్రయాణం ప్రారంభించారు. సుజనా చౌదరి గెలుపు, ఆవశ్యకతను వివరిస్తూ సాగుతున్న సాయిరాం ప్రచారం ప్రజలను ఆకట్టుకుంటోంది. నియోజకవర్గానికి ఆయన గెలిస్తే చేసే మేలు వివరిస్తూ చేపడుతున్న ప్రచారానికి ఓటర్లు నుంచి మంచి స్పందన వస్తోంది. సుజనా ని ఎందుకు గెలిపించాలీ..తద్వారా నియోజవర్గ అభివృద్ధి ఎలా జరుగుతుందన్న అంశాలను సాయిరాం సోదాహరణంగా ప్రజలకు వివరిస్తున్నారు. 22 డివిజబ్లలో ఇటువంటి అంకిత భావం కలిగిన సైనికులు వున్నారు. వీరందరూ బీజేపీకి సంపూర్ణ సహకారం అందజేస్తున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

-జ్వరాలు, విరేచనాల కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. -మందులు, అంబులెన్సుల విష‌యంలో ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాలి -వైద్యులు, సిబ్బంది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *