Breaking News

పోస్టల్ బ్యాలెట్ ని 2949 మంది వినియోగం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు తూర్పు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ని 2949 మంది వినియోగించుకున్నారని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అనువుగా ఏసి కాలేజి ఫెసిలిటేషన్ సెంటర్ లో తగిన ఏర్పాట్లు చేశామన్నారు. గురువారం ఇతర నియోజకవర్గాలతో కలిపి 132 మంది పోస్టల్ బ్యాలెట్ ని వినియోగించుకున్నారన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబందించి పోస్టల్ బ్యాలెట్ ని ఈ నెల 5వ తేదీ నుండి 9 వ తేదీ వరకు ఇతర నియోజకవర్గాలతో కలుపుకొని 3143 మందికి 2949 మంది (93.83%) తమ ఓటుని వినియోగించుకున్నారని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *