-ఎన్నికల నిర్వహణకు 72 గం.ల ముందు చేపట్టాల్సిన చర్యలపై సిద్ధంగా ఉన్నాం: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
-ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు బందోబస్తు పక్కా ప్రణాళికతో చేపడుతున్నాం: జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల మే13 న రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు 72 గంటల ముందు చేపట్టాల్సిన ఏర్పాట్లు, బందోబస్తు విస్తరణ ప్రణాళిక అమలు తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు, ఐ.జి.లు, డి.ఐ.జి.లు, సీపీలు, ఎస్పీలతో వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్పరెన్సు ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గురువారం సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, ఎస్పి కృష్ణ కాంత్ పటేల్ సంబంధిత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి హాజరై మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామని, పోలింగ్ కు 72 గం. ముందు నుండి చేపట్టాల్సిన వాటిపై సన్నద్ధంగా ఉన్నామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా సిఈఓ మాట్లాడుతూ ఈ నెల మే13 న రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు 72 గంటల ముందు చేపట్టాల్సిన ఏర్పాట్లు, బందోబస్తు విస్తరణ ప్రణాళిక అమలు తదితర అంశాలు పక్కాగా ఉండాలని, ఎన్నికలు పారదర్శకంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు.
కలెక్టర్ వివరిస్తూ ఈవిఎం కమిషణింగ్ పూర్తి అయ్యిందని, వెబ్ కాస్టింగ్ రేపటికి పూర్తి స్థాయిలో ఏర్పాటు ఐతుందని, పోలింగ్ కేంద్రాల్లో షేడ్, త్రాగు నీరు, లైటింగ్, ర్యాంపు, వీల్ చైర్ ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ఓటరు స్లిప్పులు పంపిణీ పక్కాగా చేపడుతున్నామని, బోగస్ ఓటింగ్ కు తావులేకుండా పక్కా ఎఎస్డి జాబితా రేపటికి సిద్ధమయ్యేలా చర్యలు చేపట్టామని తెలిపారు. పోలింగ్ సిబ్బంది ర్వాండమైజెషన్ ఈ నెల 11న చేపడుతున్నామని, ఎక్స్పెండిచర్ మానిటరింగ్, ఎన్నికల నిర్వహణకు కావాల్సిన సామాగ్రి నియోజక వర్గాలకు పంపామని, పోలింగ్ కు 72గం. ల ముందు చేపట్టాల్సిన విధి విధానాలు ఎస్ ఓ పీ మేరకు చేపడుతున్నామని, పోల్ డే మేనేజ్మెంట్ సిస్టమ్ వినియోగం, పోల్ అయిన ఈవిఎమ్ లను కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్ రూం నందు భద్ర పరచనున్నామని తెలిపారు. సజావుగా ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రశాంత వాతావరణంలో పారదర్శక ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఎస్పీ గారు మాట్లాడుతూ అదనపు క్యూఆర్టి అవసరం ఉన్నాయని, ఎంసిసి అమలు లో భాగంగా చర్యలు తీసుకుంటున్నామని, ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని బందోబస్తు పక్కాగా ఏర్పాటుకు ప్రణాళికలు రూపకల్పన చేసి అమలు చేస్తున్నామని ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ, పెంచల కిషోర్, అదనపు ఎస్పీ వెంకట్రావు, జిల్లా నోడల్ అధికారులు, ఎన్నికల సెక్షన్ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News