Breaking News

ఏపీ లో డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్… : లంకా దినకర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సుడిగాలి పర్యటనలు విజయవంతం అయ్యాయని బిజెపి రాష్ట్ర  ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి  పాలన మీద విసుగెత్తిన ప్రజాగ్రహం స్పష్టంగా మోడీ విజయవాడ రోడ్ షోలో బయటపడిందన్నారు. మోడీ తో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు  జోడీ రాష్ట్ర ప్రజల భవిష్యత్ కు మలుపు అని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు మోడీ గారి గ్యారెంటీ, బాబు గారి షూరిటీ, పవన్ కమిట్మెంట్ తమకు దన్నుగా నిలుస్తుందని గ్రహించారన్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్ ద్యేయంగా వికసిత భారత లో భాగస్వామ్యం చేయడానికి నరేంద్ర మోడీ సంకల్పం చాటారన్నారు. మోడీ గ్యారంటీ, బాబు ష్యూరిటీ, పవన్ కమిట్మెంట్ తో ఈనెల 13న జరిగే ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేనల ఎన్డీఏ కూటమి అభ్యర్థుల భారీ విజయం తథ్యం అని అన్నారు. జూన్ 4 న ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుతో వికసిత ఆంధ్రప్రదేశ్ తథ్యం అని అన్నారు. యువత మరియు మహిళల అభివృద్ధితోనే వికసిత్ భరత్ – వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాధ్యమని ప్రధాని మోదీ విశ్వసిస్తున్నారన్నారు. స్టార్ట్ అప్, స్టాండ్ అప్, డిజిటల్ ఇండియాతో, ఎమ్ఎస్ఎమ్ఈ లకు ప్రోత్సాహకాలతో యువతకు ఉద్యోగ మరియు ఉపాధి కల్పనకు డబుల్ ఇంజన్ సర్కార్ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 10 లక్షల కుటుంబాలు లబ్ది పొందుతున్న 18 రంగాలలో చేతి వృత్తుల వారికి “పీఎం విశ్వకర్మ” , వీధి వ్యాపారులకు “పీఎం స్వనిధి” తో మోడీ గారి చేయూత కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో గరీబ్ కల్యాణ అన్న యోజన 2.70 కోట్ల మంది ప్రజలకు కడుపు నిండా ఆహారం మరో 5 సంవత్సరాలు మోడీ పొడిగించారన్నారు. పీఎంఏవై క్రింద కేటాయించిన 25 లక్షల పేదల గృహాలను జగన్ గారు పూర్తి చేయడంలో విఫలం అయ్యారు, వాటిని పూర్తి చేసి అర్హులైన పేదలకు అందిస్తాం. ఇంకా రాష్ట్రంలోఏన్ని ఇండ్లు అవసరమో అన్ని కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రాబోయే 5 సంవత్సరాలలో పూర్తి చేస్తుందన్నారు. జల్ జీవన్ మిషన్ క్రింద గ్రామాలకు, అమృత్ పథకం క్రింద పట్టణాలకు కుళాయి ద్వారా 100% గృహాలకు సురక్షిత త్రాగు నీరు అందించడం మోడీ సంకల్పం, దాన్ని రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ పూర్తి చేస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 50 లక్షలకు పైగా రైతు కుటుంబాలు పెట్టుబడి సహాయం క్రింద సంవత్సరానికి 6,000 రూపాయలు “ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి “ క్రింద, యూరియా బస్తాకు 2000 రూపాయల చొప్పున సబ్సిడీని, “ పీఎం ఫసల్ బీమా యోజన క్రింద పంట నష్టం సహాయాన్ని మోడీ అందిస్తున్నారు – వీటిని మరింత సమర్థవంతంగా రాష్ట్రంలో రాబోయే డబుల్ ఇంజన్ సర్కార్ లబ్దుదారులకు అందిస్తుందన్నారు.

జగన్ కేంద్ర ప్రభుత్వ పథకాలకు, ప్రాజెక్టులకు మ్యాచింగ్ గ్రాంట్లు పెట్టకుండా ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి అటకెక్కించారు. వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా డబుల్ ఇంజన్ సర్కార్ మ్యాచింగ్ గ్రాంట్లను సమకూర్చి వికాసిత్ భారత్ లో ఏపీని భాగస్వామ్యం చేస్తుందన్నారు. జగన్ నిర్వీర్యం చేసిన అమరావతి రాజధానిగా అభివృద్ధి, విశాఖ – చెన్నై, బెంగుళూరు – చెన్నై మరియు బెంగుళూరు – హైదరాబాద్ కారిడార్ల పరిధిలోని పారిశ్రామిక నోడులు మరియు కనిగిరి మరియు ఏర్పేడు నిమ్జ్ లను పూర్తి చేసి ఉత్తరాంధ్ర, కోస్తా మరియు రాయలసీమల పారిశ్రామిక అభివృద్ధిని “ డబుల్ ఇంజన్ సర్కార్ “  పూర్తి చేసి మూడు ప్రాంతాల యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. రాష్ట్రంలో అస్మదీయుల క్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలు  ఇచ్చిన 5 లక్షల కోట్లకు పైగా గ్రాంట్లు, నిధులలో సింహ భాగం దోచేసి అరకొర మాత్రమే పేదల చేతిలో పెట్టి పేదలకు చేసిన మోసంని డబుల్ ఇంజన్ సర్కార్ ఆపి అర్హులైన పేదలకు లబ్ధి చేకూర్చడానికి జూన్ 4న వస్తుందన్నారు. జగన్ దోచింది కొండంత, ప్రజలకు విదిల్చింది పిసరంత. జగన్ పాలనలో ప్రతి కుటుంబం నెత్తిన 10 లక్షల రూపాయలు అప్పు భారం పెట్టాడన్నారు. జగన్ రాష్ట్రం నెత్తిన 13.50 లక్షల కోట్లు అప్పులు పెట్టాడన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *