Breaking News

దేశానికి మోదీ నాయకత్వం సుపరిపాలన అందించారు… : రొంగల గోపి శ్రీనివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశానికి మోదీ నాయకత్వం సుపరిపాలన అందించారని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  సమాజంలో బీసీ సామజికవర్గాల కష్ట నష్టాలను తెలుసుకున్న వ్యక్తి మోదీ ప్రభుత్వం అని అన్నారు. ఓబీసీ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కులాధికారాన్ని ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వం అని చెప్పాలన్నారు. 27 కేంద్ర మంత్రిత్వ శాఖలు 103 ఎంపీ లు ఇచ్చిన ఘనత మోదీ పాలన అని అన్నారు.కేంద్ర విద్యాలయం లాంటి వాటిలో ఓబీసీ లకి 27 శాతం రిజర్వేషన్ లు కలిపించారన్నారు. వీటి వల్ల డాక్టర్లు ఇంజనీర్లు, సైంటిస్ట్ లు గా అవకాశం కలిపించారన్నారు. విశ్వకర్మ యోజన పధకం కింద పేద కుటుంబాలని ఆదుకున్న ఘనత ప్రధాని మోదీ ఆలోచన అని అన్నారు. ఈ పథకం కింద వారికీ శిక్షణ నైపుణ్యం కలిపించి చేతి వృత్తి దారులని ఆదుకున్నారన్నారు. మత్స్య కారులను ఆదుకోవటంలో మోదీ ప్రభుత్వం మత్స్య యోజన లాంటి పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. చేనేత వారోత్సవాలు నిర్వహించి వారికీ ప్రోత్సాహన్ని అందించే దిశగా మోదీ ప్రభుత్వం ముందుంటుందన్నారు. ఇలా ప్రతి వర్గాల వారికీ బంగారు భవిష్యత్తు కలిపించటానికి ప్రధాని మోదీ అనేక పథకాలు పెడుతున్నారన్నారు. వలస కార్మికులకు రక్షణ కలిపించేవిధంగా మోదీ తీసుకున్న గొప్ప నిర్ణయాలు అని అన్నారు. ఆయుష్మాన్ మందిర్ ద్వారా 176 రకాల వైద్య సదుపాయాలు కలిపించిన ఘనత ప్రధాని మోదీ అని చెప్పాలన్నారు. రాష్ట్రాలలో గుర్తించిన బీసీ కులస్తులని గుర్తించి ఓబీసీ లో చేర్చి వారికీ పీఎం పథకాలు అందించే విధంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. కానీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం బీసీ లకి ఎలాంటి నిధులు కేటాయించకుండా పాలించారన్నారు. కేంద్రం బీసీ లకి నిధులు విడుదల చేస్తుంటే వాటిని పక్క దారి పట్టించారన్నారు.56 కుల కార్పొరేషన్స్ పెట్టిన జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా అవమానించారన్నారు. వైసీపీ ప్రభుత్వం కుల కార్పొరేషన్స్ ని నిర్వీర్యం చేసారన్నారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు మీద వైసీపీ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయకుండా కాలయాపన చేసారన్నారు.రాష్ట్రంలో ఎన్డిఎ కూటమి అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేస్తారన్నారు.
ఈ సమావేశం లో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయినం బాలకృష్ణ గౌడ్, బిఎస్కే పట్నాయక్, రాష్ట్ర కార్యదర్శి శివ లలిత, కె సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *