Breaking News

వెబ్ కాస్టింగ్ కంట్రోల్ రూం ఏర్పాటును పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు

-కంట్రోల్ రూం ఏర్పాటు తో పక్కాగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణ: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పోలింగ్ రోజున పోలింగ్ ప్రక్రియను జిల్లా ప్రధాన కార్య స్థానం నుండి పరిశీలించుటకు, పోలింగ్ కేంద్రంలో సజావుగా ఓటింగ్ జరుగుతోందా అని పరిశీలించడం, వాటి పర్యవేక్షణ కొరకు, సత్వర చర్యలు కొరకు మీడియా మానిటరింగ్, వెబ్ కాస్టింగ్, కమ్యూనికేషన్ కంట్రోల్ రూం ఏర్పాటును పరిశీలించిన ఎన్నికల పార్లమెంట్ సాధారణ ఎన్నికల పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్, పోలీస్ పరిశీలకులు అరవింద్ సాల్వే, ఎన్నికల వ్యయ పరిశీలకులు ప్రదీప్ కుమార్ లతో కలిసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, ఎస్పి కృష్ణ కాంత్ పటేల్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

శనివారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం జిల్లా ప్రధాన కార్య స్థానం నుండి పోలింగ్ కేంద్రంలో సజావుగా ఓటింగ్ జరుగుతోందా అని పరిశీలించడం జరుగుతుందని, వాటి పర్యవేక్షణ కొరకు, సత్వర చర్యలు కొరకు మీడియా మానిటరింగ్, వెబ్ కాస్టింగ్, కమ్యూనికేషన్ కంట్రోల్ రూం, పీడిఎంఎస్ పర్యవేక్షణ ఏర్పాటు చేశామని ఎన్నికల పరిశీలకులకు కలెక్టర్ వివరించారు. పోలింగ్ రోజున ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా లలో ప్రసారమయ్యే ఎన్నికల ప్రతికూల అంశాలను మీడియా మానిటరింగ్ కంట్రోల్ రూమ్ నందు పరిశీలించి వాటిని ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ కంట్రోల్ రూమ్ వారితో సమన్వయం చేసుకొని సత్వరమే ప్రతికూల వార్తలపై స్పందించి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *