విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మే 13, 2024న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా, మే 12 2024న అనగా ఆదివారం ఉదయం ఇంద్ర గాంధీ మున్సిపల్ స్టేడియంలో సెంట్రల్ నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర పర్యవేక్షణలో జరుగుతున్న సెంట్రల్ నియోజకవర్గం పోలింగ్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు మంజు రాజుపాల్ పరిశీలించారు. భారత ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా మే 13, 2024న జరిగే పోలింగ్‌కు, ప్రతి పోలింగ్ స్టేషన్ కు అవసరమయ్యే పోలింగ్ మెటీరియల్ ఇంద్ర గాంధీ మున్సిపల్ స్టేడియంలో సంబంధిత ఎన్నికల అధికారులు పోలీస్ స్టేషన్లో పనిచేసే ఎన్నికల సిబ్బందికి అందించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ప్రక్రియను సజావుగా జరుగుతుందా లేదా అని సాధారణ ఎన్నికల పరిశీలకురాలు మంజు రాజుపాల్ పరిశీలించారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News