-సెంట్రల్ నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ మరియు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మే 13, 2024న పోల్ డే సందర్భంగా ఓటర్లoదరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా సెంట్రల్ నియోజకవర్గం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో 267 పోలింగ్ బూతులు ఉన్నాయని, ప్రతి పోలింగ్ స్టేషన్ కు ఒక హెల్ప్ డెస్క్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని, ఓటర్లకు ఏ సందేహం వచ్చిన ఆ ఓటర్స్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించి, తమ పోలింగ్ బూత్ ని తెలుసుకోవచ్చని, సందేహాలని తీర్చుకోవచ్చని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు ఓటు వేయవచ్చని, ఓటర్లకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీటి వసతులు కల్పించారని, పోలింగ్ బూత్ చూపించే సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురవకుండా, ప్రశాంతంగా సజావుగా తమ ఓటు హక్కును వినియోగించుకో విధంగా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
Prajavartha Online Telugu News