-అర్హులైన ప్రతి ఓటరు తప్పక తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలి:కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా పోలింగ్ నిర్వహణకు ఒకరోజు ముందు డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ పార్టీ సంబంధిత పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రితో, ఈవిఎం ల తరలింపు భద్రత నడుమ చేపట్టాలని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పక మే 13 న వినియోగించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఆదివారం మధ్యాహ్నం తిరుపతి జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని గూడూరు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని తనిఖీ చేసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మీడియా తో మాట్లాడుతూ….రేపు మే13 న మన జిల్లాలో క్షేత్ర స్థాయిలో జరగబోయే పోలింగ్ కు అన్ని సంసిద్ధంగా ఉన్నాయని పోలింగ్ ముందు రోజున సూళ్లూరుపేట, సత్యవేడు నియోజకవర్గాలలో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను తనిఖీ చేసి పోలింగ్ సామాగ్రిని సక్రమంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో లేదా చూడడం జరిగిందని అన్ని నియోజకవర్గాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలిస్తున్నానని అలాగే గూడూరు నియోజకవర్గానికి రావడం జరిగిందని డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి ప్రోటోకాల్ పాటిస్తున్నారా లేదా అని పరిశీలించడం జరుగుతుందని, పోలింగ్ కు సంబంధించి విధులు కేటాయించిన వారు అందరూ హాజరయ్యారా లేదా పరిశీలించి ఎవరైనా రానిచో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈవీఎంలు అన్ని సిద్ధంగా ఉన్నాయని, పోలింగ్ కు సంబంధించిన మెటీరియల్స్ అన్ని కూడా సిద్ధంగా ఉంచామని , ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సజావుగా జరుగుతోందని తెలిపారు. గూడూరు నియోజకవర్గానికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ చేసిన పోలింగ్ సామాగ్రిని, ఈవిఎం లు పోలీస్ ఎస్కార్ట్ బందోబస్తు నడుమ సెక్టరల్ అధికారి, రూట్ మొబైల్ తో కలిసి పోలింగ్ స్టేషన్ కి చేర్చడం జరుగుతుందని తెలిపారు. ఏవైతే సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ వెబ్ కాస్టింగ్ తప్పకుండా చేస్తున్నామని, మరియు మైక్రో అబ్జర్వర్లను కూడా నియమించడం జరిగిందని అన్నారు. వెబ్ కాస్టింగ్ లేని ప్రదేశాల్లో వీడియోగ్రఫీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రిటర్నింగ్ ఆఫీసర్లకు మరియు పోలింగ్ ఆఫీసర్లకు మధ్యన సెక్టర్ ఆఫీసర్ ఉంటారని, పోలింగ్ కు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ను ప్రిసైడింగ్ అధికారి మొబైల్ యాప్ పీడిఎంఎస్ (పోల్ డే మానిటరింగ్ సిస్టమ్) ద్వారా అప్డేట్ చేయాలని సూచించారు. ప్రతి ప్రిసైడింగ్ అధికారి సెల్ ఫోన్ నందు పిడిఎంఎస్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల సామాగ్రి పోలింగ్ స్టేషన్లోకి చేరిన తర్వాత రేపు అనగా పోలింగ్ రోజున మాక్ పోల్ ఉదయం 5.30 కి పోలింగ్ ఏజెంట్లు సమక్షంలో నిర్వహించాల్సి ఉంటుందని, పోలింగ్ మొదలయ్యాక ప్రతి రెండు గంటలకు ఒకసారి ప్రిసైడింగ్ అధికారి మొబైల్ యాప్ ద్వారా రిపోర్ట్స్ పంపించాలని తెలిపారు. ఈవీఎంలు రిజర్వులో అందుబాటులో సెక్టర్ ఆఫీసర్ వద్ద ఉంటాయని, పోల్ జరుగుతున్న సమయంలో ఈవీయంలో ఏదైనా సమస్య తలెత్తితే సెక్టార్ ఆఫీసర్ ని సంప్రదిస్తే వారు వెంటనే ఈవీఎంలను రీప్లేస్ చేసి పోలింగ్ ఆగకుండా చూస్తారని తెలిపారు. సమాచార మార్పిడి లోపం ఎక్కడ రాకుండా జిల్లా స్థాయి నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ వరకు రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి బూత్ లెవెల్ స్థాయి వరకు కమ్యూనికేషన్ ఉండేలా పక్కా ప్రణాళిక చేయడం జరిగిందని అన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉందనీ పొలిటికల్ పార్టీ వారు దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ప్రచారాలు చేయరాదని, ఎన్నికలలో పోటీ చేయు వ్యక్తికి వెహికల్ పాస్ ఒకటి ఇవ్వడం జరుగుతుందని ఐదుగురికి మించి వాహనంలో ఉండరాదని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు పొలిటికల్ పార్టీ వారు, అభ్యర్థులు పోలింగ్ కు సహకరించాలని తెలిపారు. జిల్లాలో మొత్తం 18.12 లక్షల మేరకు ఓటర్లు ఉన్నారని, పోలింగ్ రోజున మన జిల్లా లోని ఓటర్లందరూ తప్పక వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో ఎన్నికలు నిర్వహించడానికి అన్ని విధాల సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గూడూరు కిరణ్ కుమార్, డిఎస్పీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News