Breaking News

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దం

-ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలి
-హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా కేంద్ర, సాయుధ రిజర్వ్ బలగాలు, రాష్ట్ర పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు
-జిల్లా కంట్రోల్ రూం ద్వారా నిరంతర పర్యవేక్షణ వెబ్ కాస్టింగ్, మీడియా మానిటరింగ్
-తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో 100 శాతం వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు :జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో సాధారణ ఎన్నికలు -2024 కు సంబంధించి ఈనెల 13న రేపు జరిగే పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుటకు అన్ని విధాలా ఏర్పాట్లు పూర్తిచేశామని, జిల్లాలో ఓటు హక్కు కలిగిన ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని, ఎన్నికల పోలింగ్ సరళిని జిల్లా కంట్రోల్ రూం ద్వారా రియల్ టైమ్ లో వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలన, మీడియా మానిటరింగ్ ఉంటుందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

పోలింగ్ ముందు రోజైన ఆదివారం నాడు జిల్లాలోని తిరుపతి, చంద్రగిరి, గూడూరు, సూళ్ళూరుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తి లో ఎన్నికల సామాగ్రి, ఈవిఎం ల డిస్ట్రిబ్యూషన్ ను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈ సంధర్భంగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వివరిస్తూ… జిల్లాలో పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుటకు అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 18,12,980 ఓటర్లు ఉన్నారని తెలిపారు. జిల్లాలో ఉన్న 2140 పోలింగ్ కేంద్రాల నందు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలైన చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాల నందు వంద శాతం వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశామని, ఎన్నికల నిర్వహణ కొరకు 1401 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు, 964 మైక్రో అబ్జర్వర్లు, వీడియోగ్రాపర్లు 888 మందిని, 15,936 వేల మంది ఎన్నికల సిబ్బందితోపాటు దాదాపు 5 వేల మంది పోలీస్ సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. రేపు ఉదయం 13 వ తేదీ 5.30 గంటలకు మాక్ పోల్ నిర్వహించడం జరుగుతుందని అనంతరం ఉదయం 7.00 గంటల నుండి పోలింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. వేసవి ఎండలు దృష్ట్యా పోలింగ్ కేంద్రాల యందు త్రాగునీరు, షేడ్ ఏర్పాటు, మెడికల్ క్యాంప్ లు, వీల్ చైర్ ఏర్పాటు ప్రతి మండల కేంద్రం నందు ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంచడం జరిగిందని, పోలింగ్ సిబ్బందికి, ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం నందు సాయుధ బలగాలు, పోలీసు తగినంత బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు.

పోలింగ్ ప్రారంభమయినప్పటి నుండి సెక్టార్ అధికారులు, రూట్ మొబైల్ ప్రతి రెండు గంటలకు తమ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రక్రియ తనిఖీ నిర్వహించడం జరుగుతుందని , ప్రతి పోలింగ్ కేంద్రం లోని పి.ఓ. లు PDMS యాప్ డౌన్లోడ్ చేసుకుని పోలింగ్ సంబందిత సమాచారాన్ని యాప్ లో మాక్ పోల్ మొదలు, పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి ప్రతి 2 గం.లకు పోలింగ్ శాతం నమోదు చేయాలని తెలిపారు. తిరుపతి నియోజకవర్గంలో అధికంగా 46 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ప్రతి పోలింగ్ కేంద్రాలలో అందరు పార్టీల ఏజెంట్లకు సిటింగ్ సామర్థ్యం లేనందున ఎన్నికల కమీషన్ సూచనల మేరకు పోలింగ్ కేంద్రాలలో ఎక్కడైతే స్థలాభావం వలన తక్కువ స్థలం ఉండి, ఎక్కువమంది అభ్యర్థులు పోటీల్లో ఉన్నారో అక్కడ ప్రాధాన్యతా క్రమంలో ఎవరిని లోపల అనుమతి అనేది సంబంధిత ప్రిసైడింగ్ అధికారి అబ్జర్వర్ గారి సూచనల మేరకు, రిటర్నింగ్ అధికారి, సెక్టార్ అధికారి సూచనల మేరకు సీటింగ్ కొరకు చర్యలు తీసుకుంటారని తెలిపారు. తాజా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు గుర్తింపు పొందిన జాతీయ పార్టీల అభ్యర్థులు, గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల అభ్యర్థులు, గుర్తింపు పొందిన ఇతర రాష్ట్ర పార్టీలు ఎవరైతే వారి పార్టీ సింబల్ కేటాయించబడిన అభ్యర్థులు, రిజిస్టర్డ్ మరియు గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇలా పోలింగ్ కేంద్రంలో స్థలం అందుబాటులో ఉన్న మేరకు అనుమతి ఉంటుందని, మిగిలిన వారు పోలింగ్ కేంద్రం బయట కూచుని అవసరం మేరకు పోలింగ్ కేంద్రం లోపలికి వెల్లి పరిశీలించవచ్చని తెలిపారు. ఇది అర్థం చేసుకుని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. పోలింగ్ ముగిసిన తర్వాత 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోల్డ్ ఈవీఎంలు భద్రత నడుమ సంబందిత రెసెప్షన్ సెంటర్ల నందు బద్రపరచి మే 14న శ్రీ పద్మావతి మహిళ యూనివర్సిటీ నందు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ నందు సాధారణ పరిశీలకుల, రిటర్నింగ్ అధికారుల, రాజకీయ పార్టీల, అభ్యర్థుల సమక్షంలో భద్రపరచడం జరుగుతుందని వీడియో రికార్డింగ్ చేయబడుతుందని, వెబ్ కాస్టింగ్ ద్వారా ఈవిఎం ల భద్రత పర్యవేక్షణ చేయడం జరుగుతుందని పోటీ చేస్తున్న అభ్యర్థులు లేదా ఏజెంట్లు ప్రతిరోజు సీసీటీవీలో శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయంలో పరిశీలించవచ్చని, త్రీ లేయర్ సెక్యూరిటీ ఏర్పాటుతో సిఎపిఎఫ్ కేంద్ర బలగాలు, రాష్ట్ర సాయుధ బలగాలు, రాష్ట్ర పోలీసులు భద్రత కల్పిస్తారని తెలిపారు. పోలింగ్ సమయంలో ఏదైనా ఫిర్యాదులు ఉంటే 1950 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

రేపు 13న జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పండుగ వాతావరణంలో నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులు, ప్రజలు సహకారం అందించాలని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఈ సంధర్భంగా కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *