పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి మరియు తిరిగి జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి గత కొన్ని రోజులుగా రేయంబవళ్ళు అహర్నిశలు కష్టపడి పనిచేసి ఈ రోజు జరిగిన ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి, పెనమలూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి జోగి రమేష్ అన్నారు.
పెత్తందారులకు పేదవాళ్ళకి మధ్య జరిగిన ఈ మహా సంగ్రామంలో తెలుగుదేశం పార్టీ కూటమి పెత్తందారులు ఎన్నో అవంతరాలు మరియు అడ్డంకులు సృష్టించినప్పటికీ, పేదల పక్షాన నిలిచి ఈరోజు పోలింగ్ బూత్ వరకు వారిని తోడుకొని వచ్చి సగర్వంగా వారు ఓటు వేసేలా సహకరించిన మన వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులైన నాయకులకు, ప్రజాప్రతినిధులకు,కార్యకర్తలకు, పార్టీ సానుభూతిపరులు మరియు పార్టీలోని ప్రతి ఒక్కరికి పేరుపేరునా ముఖులిత హస్తాలతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇచ్చిన పిలుపుమేరకు నా విజ్ఞప్తిని మన్నించి రాష్ట్రంలో సంక్షేమ పాలన తిరిగి కొనసాగాలంటే వైఎస్ జగన్ ని తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవటమే మన ప్రథమ కర్తవ్యం అని భావించి గత కొన్ని రోజులుగా మీ కుటుంబాలను సైతం వదిలిపెట్టి, నాతో పాటు నిలిచి, నడిచి ఈరోజు జరిగిన ఎన్నికల పోలింగ్ లో పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరినీ భాగస్వాములను చేసినందుకు మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
నన్ను మీ బిడ్డగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా మీ కుటుంబంలో ఒకడిగా సొంతం చేసుకొని నన్ను ఆశీర్వదించడానికి ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం లెక్కచేయకుండా ఎన్నికల కేంద్రాలకు బారులు తీరిన అవ్వ తాతలకు, అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు మరియు యువతీ యువకులకు మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను.. గతంలో ఎన్నడు లేని విధంగా ఇంత పెద్ద శాతంలో పోలింగ్ జరగటం అనేది ఒక చారిత్రాత్మక విషయమని, జగనన్న సంక్షేమ పాలనలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పోలింగ్ లో పాల్గొని మీ ఆశీర్వాదాలు అందజేశారని మనస్పూర్తిగా విశ్వసిస్తున్నాను..
మీ అందరూ ఇంత పెద్ద సంఖ్యలో పొలింగ్ లో పాల్గొనడంతో, తాము చిత్తుచిత్తుగా ఓడిపోబోతున్నామని విషయం గ్రహించిన తెలుగుదేశం పార్టీ దురహంకారులు పెనమలూరు నియోజకవర్గ పరిధిలో అనేక పోలింగ్ స్టేషన్లో ఎన్నో ఆకృత్యాలకు, దాడులకు మరియు కుట్రలకు తెరలేపి దొంగ ఓట్లతో, దాడులతో మరియు బెదిరింపులతో పోలింగ్ ను అడ్డుకోవాలని చూడడమే కాకుండా, వారి ఆగడాలను ప్రశ్నించిన మన వైసీపీ కుటుంబ సభ్యులపై భౌతిక దాడి చేసితీవ్రంగా గాయపరచడమే కాకుండా పోలింగ్ బూత్ లను సైతం ఆక్రమించుకొని రిగ్గింగ్ కు పాల్పడటం వంటి అనేక దుశ్చర్యలకు పాల్పడినప్పటికీ, మనలో ఎవరో సంయమనం కోల్పోకుండా ఎన్నికలు సజావుగా ముగియటానికి తోడ్పాటు అందించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
మీ అందరూ నాపై చూపిన అంతులేని ప్రేమానురాగాలు మరియు అవాజ్యమైన ఆదరాభిమానాలు చూశాక మీకు ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేనని, అది నా బాధ్యతను మరింత పెంచి మీరు కల్పించిన ఈ అవకాశాన్ని మనసా వాచా కర్మేనా మీకు సేవ చేసుకుంటూ మీ కష్టసుఖాల్లో మీకు తోడుగా ఉంటానని హామీ ఇస్తూ, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేరుగా నన్ను సంప్రదించాలని మీకు సేవ చేసేందుకు నిరంతరం మీ బిడ్డ మీకు తోడుగా అండగా నిలబడతాడని హామీ ఇస్తున్నానని జోగి రమేష్ అన్నారు.
Prajavartha Online Telugu News