విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కేంద్ర మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూటమి బలపరిచిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. శనివారం హైదరాబాదులోని చంద్రబాబు నివాసంలో చంద్రబాబుని ఆత్మీయంగా కలిసిన సుజనా చౌదరి తాజా రాజకీయాలపై చర్చించారు. విజయవాడ పశ్చిమంలో జరిగిన ఎన్నిక సరళని ఆయనకు వివరించారు.
Prajavartha Online Telugu News