-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు 2024 పోలింగ్ ప్రక్రియ పూర్తి అయిన నేపథ్యంలో కౌంటింగ్ జూన్ 4న చేపట్టనున్న కౌంటింగ్ ప్రక్రియ కొరకు సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ పూర్తి అయ్యిందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా జూన్ 4వ తేదీన 23- తిరుపతి (ఎస్ సి) పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ నిర్వహణ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టనున్న నేపథ్యంలో కౌంటింగ్ కొరకు సిబ్బంది మొదటి రాండమైజేషన్ ప్రక్రియ నేటి శుక్రవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్ నందు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో పూర్తి చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు సూచించిన ఈసీఐ వెబ్సైట్ సాఫ్ట్వేర్ నందు కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ సహాయకులు,కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ సజావుగా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. అందులో కౌంటింగ్ సూపర్వైజర్లు 310 మందికి గాను 311 మంది వివరాలను, కౌంటింగ్ అసిస్టెంట్లు 383 గాను 395 మందిని, కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్లు 346 గాను 347 మందిని వెరసి మొత్తం 1039 మంది 208 కౌంటింగ్ టేబుల్ లకు అవసరమైన నేపథ్యంలో రిజర్వ్ తో కలిపి 120 శాతంతో 1053 మందిని కౌంటింగ్ కొరకు కేటాయించడమైనదని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, మాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి చంద్రశేఖర్ నాయుడు,ఎన్ఐసి డిఐఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News