Breaking News

పోలింగ్ విధులకు గైర్హాజరైన 272 మందికి షోకాజ్ నోటీస్ లు జారీ చేసిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్

-పిఓ, ఎపీఓ, పోలింగ్ సిబ్బంది రెండవ దఫా శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరైన 14 మందికి షోకాజ్ నోటీసులు జారీ…. 5 మందిని సస్పెండ్ చేసిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు 2024 లో భాగంగా పిఓ, ఎపీఓ, పోలింగ్ సిబ్బందికి ఇచ్చిన రెండవ దఫా శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరైన 14 మందికి షోకాజ్ నోటీసులు కలెక్టర్ జారీ చేయగా అందులో వారు సమర్పించిన వివరణ సంతృప్తికరంగా లేనందున 5 మందిని సస్పెండ్ చేసినట్లుగా, పోలింగ్ విధులకు గైర్హాజరైన 272 మందికి షోకాజ్ నోటీస్ లు జారీ చేసినట్లుగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సార్వత్రిక ఎన్నికల నిర్వహణ అనేది ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప బాధ్యతతో కూడిన కర్తవ్యమని, ఉద్యోగులు తమకు కేటాయించబడిన ఎన్నికల విధులను బాధ్యతగా నిర్వర్తించాలని తెలిపారు. కానీ కొందరు పిఓ, ఎపీఓ, పోలింగ్ సిబ్బంది వారికి ఏర్పాటు చేసిన రెండవ దఫా శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరైన 14 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని, అందులో వారు సమర్పించిన వివరణ సంతృప్తికరంగా లేనందున 5 మందిని సస్పెండ్ చేసినట్లుగా కలెక్టర్ తెలిపారు.

అలాగే పోలింగ్ విధులకు గైర్హాజరైన 272 మందికి వ్రాత పూర్వక సంజాయిషీ కొరకు అండర్ సెక్షన్ 134 RP Act ప్రకారము షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగిందని, దీనికి 5 రోజులలో వారి నుండి సంతృప్తికరమైన సమాధానం రాకపోయిన యెడల ఎన్నికల విధుల నిర్వహణలోఅలసత్వం ప్రదర్శించినందు వలన ఎన్నికల నియమావళి ప్రకారము తగు చర్యలు గైకొనబడునని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *