-జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు
-పరిపాలనాధికారి బి.వి.ఎస్.రామారావు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుకు జిల్లాలో 960 మంది అభ్యర్థులు శనివారం ఉదయం పరీక్షలకు హాజరు కానున్నారని కలెక్టరేట్ పరిపాలనాధికారి బి.వి.ఎస్ రామారావు తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో సమన్వయ శాఖల అధికారులతో ఎపిపి ఎస్సి పరీక్షల ముందస్తు ఏర్పాట్లపై సమావేశము నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏ వో రామారావు మాట్లాడుతూ పరీక్షలు సక్రమంగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయ్యాలని కోరారు. ఈ పరీక్షల కోసం రాజమండ్రిలో రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టి ట్యూషన్స్ కళాశాలలో సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఉదయం 9.00 గంటల నుండి ఉదయం 11. 30 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగు తుందన్నారు. ఉదయము 7.30 గంటల నుండి ఉదయం 8.15 వరకు పరీక్ష వ్రాసే అభ్యర్థులను అనుమతించడం జరుగు తుందన్నారు. గ్రేస్ పిరియడ్ 15 నిమిషాలు ఉంటుందని, తదుపరి పరీక్ష హాలు లోనికి అభ్యర్దులను అనుమతించడం జరగదనీ, కావున ముందుగా అభ్యర్ధులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. మొబైల్ ఫోన్లు, కాలిక్యు లేటర్లు, ఐప్యాడ్, బ్లూటూత్, పేజర్ లే దా ఇంట్రాక్ట్ ప్రోగ్రామింగ్ చేయగల ఇతర ఎలక్ట్రాన్రిక్ పరికరాలను పరీక్షా కేంద్రానికి అనుమతించడం జరగడన్నారు. పరీక్షా కేంద్రాలకు నిరంతరాయంగా విద్యుత్తు ఉండేలా చూసుకోవాలని, వేసవి దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో మంచినీటి సరఫరా, పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని సంబంధిత శాఖల అధికారులు ఆదేశించారు.
ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్, ఏ.ఎం మాధవీలత మాట్లాడుతూ అభ్యర్దులు హాల్ టికెట్ తో పాటుగా ఒక ఒరిజినల్ ఫోటో ఐ.డి. (పాస్ పోర్టు, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు లతో హాజరు కావాలన్నారు. పరీక్షలు వ్రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు పరీక్ష సమయానికి కంటే ఒక గంట ముందు పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలని అన్నారు.
ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, కే అనిల్ కుమార్, డిహెచ్ఎంవో, పి. జాన్స న్ రాజు, ఎస్. ఐ., ఏ కలం, ఎపీ ఈ పి. డీసీఎల్, డి ఈ ఈ, ఎస్. దేవయ్య, లైజన్ ఆఫీసర్, టి.దివాకర్ వివిధ శాఖల అధి కారులు పాల్గొన్నా రు.
Prajavartha Online Telugu News