Breaking News

ఆరోగ్య‌శ్రీ సేవ‌ల‌కు అంత‌రాయమేమీ లేదు

-నెట్వ‌క్క్ ఆసుప‌త్రుల యాజ‌మాన్యాలు సానుకూలంగానే స్పందిస్తున్నాయి
-డాక్ట‌ర్ వైయ‌స్సార్ ఆరోగ్య‌శ్రీ హెల్త్ కేర్ ట్ర‌స్ట్ సిఇఓ డాక్ట‌ర్ జి.ల‌క్షీశా వెల్ల‌డి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్యశ్రీ ల‌బ్దిదారుల సేవ‌ల‌కు అంత‌రాయం క‌లిగించ‌కుండా స‌హ‌క‌రించాల‌నే పిలుపున‌కు అన్ని నెట్వ‌క్క్ ఆసుప‌త్రుల యాజ‌మాన్యాలూ సానుకూలంగానే స్పందిస్తున్నాయ‌ని డాక్ట‌ర్ వైయ‌స్సార్ ఆరోగ్య‌శ్రీ హెల్త్ కేర్ ట్ర‌స్ట్ సిఇఓ డాక్ట‌ర్ జి.ల‌క్షీశా నేడొక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. ఆరోగ్య‌శ్రీ ట్ర‌స్ట్ నుండి గ‌త ఆర్థ‌క సంవ‌త్స‌రంలో ఇప్ప‌టి వ‌ర‌కు రూ.3,566.22 కోట్లు నెట్వ‌ర్క్ ఆసుప‌త్రుల ఖాతాల్లో జ‌మ చేశామ‌న్నారు. ఈ ఆర్థ‌క సంవ‌త్స‌రంలో మొద‌టి రెండు నెల‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు రూ.366 కోట్లు నెట్వ‌క్క్ ఆసుప్ర‌తుల ఖాతాల్లో జ‌మ‌చేశామ‌ని తెలిపారు. గ‌త రెండు రోజులుగా ఆరోగ్య‌శ్రీ ప‌ధ‌కం కింద ల‌బ్దిదారులకు సేవ‌లందాయ‌నీ, ఈనెల 22న 6718 మంది ల‌బ్దిదారులు, 23న 7118 మంది ల‌బ్దిదారులు చికిత్స పొందార‌నీ ఆయ‌న వివ‌రించారు. గ‌త సంవ‌త్స‌ర కాలంలో రాష్ట్రంలో రోజుకు స‌గ‌టున 5349 మంది ల‌బ్దిదారులు ఆరోగ్యశ్రీ ప‌థ‌కం కింద సేవ‌లు పొందార‌న్నారు. ఆరోగ్య‌శ్రీ ద్వారా అంద‌రికీ స‌కాలంలో వైద్యం అందుతోంద‌నీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ తో పాటు పొరుగు రాష్ట్రాల్లో గుర్తింపుపొందిన ఆసుప‌త్రుల్లోకూడా ఆరోగ్య‌శ్రీ కింద వైద్యం చేయించుకునేందుకు వెసులుబాటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *