-ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎంతో సున్నితత్వం కలిగిన ఉండడం గమనార్హం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లను లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకులు నిర్వర్తించే పాత్ర అత్యంత కీలకమని కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి డా.కె. మాధవీలత స్పష్టం చేశారు.
సోమవారం సాయంత్రం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో సార్వత్రిక ఎన్నికలు-2024 నేపద్యంలో జూన్ 4 వ తేదీన నిర్వహించనున్న కౌంటింగ్ ప్రక్రియపై మైక్రో అబ్జర్వర్స్ ల శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎన్నికల అధికారి డా. కే.మాధవీలత పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి డా. మాధవీలత మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13 న పోలింగు రోజున ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వహించడం జరిగిందని, ఆ క్రమంలో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోవడం జరిగిందన్నారు. గత ఆరు నెలలుగా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు రిటర్నింగ్ అధికారులు నుంచి వివిధ స్థాయి లో అధికారులు సిబ్బంది తదితరులు పని చెయ్యడం జరిగిందన్నారు. పొలింగ్ రోజున మనందరం కలిసి కట్టుగా ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ దశకు చేరుకున్నట్లు తెలిపారు. పొలింగ్ తదుపరి మనపై ఒత్తిడి అనేది లేకుండా ఉంటుందనీ తెలియ చేశారు. అయితే మరో కీలక మైన బాధ్యతలు మనందరిపై ఉందని తెలిపారు. జూన్ 4 వ తేదీన ఓట్లను లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమన్నారు. పొలింగ్ రోజున కష్టతరమైన విధులను, బాధ్యతలను మైక్రో అబ్జర్వర్ల ఎంతో ఇష్టంగా చేశారని తెలిపారు. జూన్ 4 వ తేదీన లెక్కింపు కేంద్రాల్లోని ప్రతి టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్స్ నియమించడం జరుగుతుందన్నారు. నిబంధనల మేరకు సజావుగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయడానికి మైక్రో అబ్జర్వర్లు కృషి చేయాలని, పోస్టల్ బ్యాలెట్, ఈ టీ పిబి ఎస్, ఈవిఎమ్ లలో ఓట్లు, వివి పాట్స్ ఓటర్ స్లిప్స్ లెక్కింపు చెయ్యాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మైక్రో అబ్జర్లు, రిటర్నింగ్ అధికారులు పోలింగ్ రోజు ఎంతో బాద్యతాయుతంగా విధులు నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియలో పోస్టల్ బ్యాలెట్‌లను నిర్వహించడం, ఎలక్ట్రానిక్‌గా ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ETBPS), ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లు (EVM) మరియు ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్స్ (VVPAT ట్రయల్స్) వంటి వివిధ అంశాలను మైక్రో అబ్జర్వర్స్ నిశితంగా పరిశీలించడం ఉంటాయన్నారు. మీరకు పవర్ ఫాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి స్థాయిలో ఈ మొత్తం ప్రక్రియ ను వివరించడం జరిగిందన్నారు. వాటినీ వాట్సాప్ గ్రూపు లలో పంపడం జరిగిందనీ, వాటికి పునశ్చరణ చేసుకోవాలని కోరారు. కొన్ని సందర్భలలో పరిశీలకులుగా తీసుకోవలసిన జాగ్రత్తలు విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. వాటికి అనుగుణంగా రిటర్నింగ్ అధికారులు నిర్ణయాలు తీసుకుంటారని మాధవీలత తెలియ చేశారు. ఫ్రీ, ఫెయిర్, పారదర్శకంగా ఓట్ల లెక్కింపు చెయ్యడం మీ అందరిపై ఉన్న ప్రాధాన బాధ్యత అని మాధవీలత పేర్కొన్నారు. ఈ వి ఎమ్ యూనిట్స్ లో ఏడు సెకండ్స్ పాటు అభ్యర్ధి వారీగా పోలైన ఓటు వివరాలు నమోదు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఆ డిస్ ప్లే ఆయా కౌంటింగ్ టేబుల్ వద్ద ఉన్న కౌంటింగ్ ఏజెంట్స్ నిర్దారణ చేసుకోవడం జరుగుతుందనీ అన్నారు. ఓట్ల లెక్కింపులో పరిశీలన ప్రక్రియ లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని , ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడం లో మీ మీ వంతు పనితనం ముఖ్యం అని పేర్కొన్నారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్వో జి. నరశింహులు, కేఆర్సిసి స్పెషల్ డిప్యూటీ కలెక్టరు ఎమ్ . కృష్ణ నాయక్, ట్రైనీ డిప్యూటి కలెక్టర్ ఎం భాను ప్రకాష్, మైక్రో అబ్జర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News