రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
జూన్ 2 వ తేదీ ట్రైల్ కౌంటింగ్ నేపధ్యంలో ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో ఎస్పి పి. జగదీష్ తో కలిసి పరిశీలించినట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలిపారు. సోమవారం రాత్రి ఎస్పి పి జగదీష్, రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికారులు, ఇతర అనుబంధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వెండర్ కి కీలకమైన సూచనలు చెయ్యడం జరిగింది. జూన్ 4 వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ చేపట్టానున్నామని, అందులో భాగంగా జూన్ 2 వ తేదిన పూర్తి స్థాయిలో ట్రెయిల్ రన్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ, స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ వరకు ఈ వి ఎమ్ యూనిట్స్, తరలింపు, కౌంటింగ్ పూర్తి అయిన తరువాత తిరిగి స్ట్రాంగ్ రూమ్ లకు తరలింపు వంటి వాటిపై వాస్తవ పరిస్థితిని గమనించి లోటుపాట్లను అధిగమించడం జరుగుతుందనీ అన్నారు. ఈ క్రమంలో ఎస్పి పి జగదీష్ పలు సూచనలు చెయ్యడం జరిగిందని, పరస్పరం ఆయా అంశాలపై నిర్దుష్టమైన కార్యచరణ రూపొందించడం లో భాగంగా జూన్ 2 వ తేదీ నాటికి ఒక స్పష్టమైన అవగాహన రావడం జరుగుతుందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పి పి జగదీష్, అదనపు ఎస్పీ ఎల్. చెంచి రెడ్డి, ఆర్డీవో చైత్ర వర్షిణి, డీపీఓ డి. రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News