అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జూన్ నెలలో రానున్నపవిత్ర బక్రీద్ పర్వదినం సందర్భంగా జంతువుల అక్రమ రవాణా మరియు జంతు వధ నియంత్రణకు రాష్ట్ర,జిల్లా స్థాయిలో నోడలు అధికారులను నియమిస్తూ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.అక్రమ జంతు రవాణా మరియు జంతువధల నియంత్రణ పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో డిజిపి కార్యాలయంలో యం.రవీంద్రనాధ్ బాబు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్(శాంతి భద్రతలు)నోడలు అధికారిగా నియమించారు.అలాగే జిల్లా స్థాయి నోడలు అధికారులుగా అదనపు ఎస్పి లేదా డిఎస్పి స్థాయిలో నోడలు అధికారులను నియమించడం జరిగింది.ఈనోడలు అధికారులు జంతువుల అక్రమ రవాణా మరియు అక్రమ జంతువధలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి ఎక్కడైనా అక్రమ జంతు రవాణా లేదా వధలు జరుగుతుంటే తక్షణ చర్యలు తీసుకోవాలని డిజిపి ఆదేశాల్లో స్పష్టం చేశారు.జంతువుల అక్రమ రవాణా మరియు అక్రమ జంతువధల నియంత్రకు సంబంధించి జిల్లాల్లో ఆయా శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిజిపి హరీశ్ కుమార్ గుప్త జిల్లా పోలీస్ సూపరింటిండెంట్లను ఆదేశించారు.
అదే విధంగా వివిధ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని కబేళాలపై కూడా జంతు అక్రమ రవాణా మరియు జంతువధలపై కూడా ప్రత్యేక నిఘా ఉంచాలని డిజిపి నోడలు అధికారులను ఆదేశించారు.అంతేగాక ఎక్కడైనా అక్రమ జంతు రవాణా మరియు జంతు వధ సంఘటనలు జరిగే వారికి జంతుహింస నివారణ చట్టాల కింద విధించే శిక్షలు ఇతర అంశాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని డిజిపి స్పష్టం చేశారు.
రానున్న బక్రీద్ పర్వదినం సందర్భంగా జంతువుల అక్రమ రవాణా,జంతు వధలను నియంత్రించాలని జంతు సంరక్షణ సంస్థ కార్యదర్శి ఎస్.గోపాల రావు రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యాన్ని దాఖలు చేసిన నేపధ్యంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జంతువుల అక్రమ రవాణా మరియు అక్రమ జంతువధల నియంత్రణకు చెక్ పోస్టులు వంటివి ఏర్పాటు ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని యానిమల్ వెల్పేర్ బోర్డుకు పలు మార్గదర్శక ఆదేశాలను జారీ చేసిన నేపధ్యంలో పోలీస్ శాఖ తరపున రాష్ట్ర స్థాయి,జిల్లా స్థాయిల్లో నోడలు అధికారులను నియమించినట్టు డిజిపి హరీశ్ కుమార్ గుప్తా తెలియజేశారు.
Tags AMARAVARTHI
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News