Breaking News

ఎన్నికలలో పోటిచేసిన అభ్యర్ధులతో సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ది.04.06.2024 తేదిన నిర్వహించు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ ను పారదర్శక మరియు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేదుకు పోలీస్ కమీషనర్ పి.హెచ్.డి.రామ కృష్ణ ఐ.పి.ఎస్.  ఈ రోజు పోలీస్ కమాండ్ కంట్రోల్ నందు ఎన్నికలలో పోటి చేసిన అభ్యర్ధులు మరియు వారి ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్.టి.ఆర్.జిల్లాలోని మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు విజయవాడ పశ్చిమ, సెంట్రల్, ఈస్ట్ మరియు విజయవాడ పార్లమెంట్ కు పోటీ చేసే అభ్యర్ధులు లేదా వారి ప్రతినిధులు 115 మంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ……కౌంటింగ్ కేంద్రాలు అయిన ఇబ్రహింపట్నం పోలీస్ స్టేషన్ పరిదిలోని నిమ్రా మరియు నోవా కళాశాలలకు హాజరయ్యే అభ్యర్ధులు, ఏజెంట్లు నేరుగా వారి సొంత వాహనాలలో రావడానికి వీలులేదని, వారి సొంత వాహనాలను కౌంటింగ్ సెంటర్ కు మూడు వైపులా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలలో పార్కింగ్ చేసుకుని అక్కడ జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులు ఎక్కి కౌంటింగ్ సెంటర్ కు రావాలని, దీనికి తగు విధంగా ఏర్పాటు చేసుకునేవిధంగా అభ్యర్ధులు ఏజెంట్లకు సూచనలు చేయాలని తెలిపారు.

జిల్లా యంత్రాంగం బస్సులను ఇబ్రహింపట్నం ఫెర్రీ వద్ద, కేతన కొండ వద్ద మరియు వి.టి.పి.ఎస్. ఏ. కాలనీ వద్ద సిద్దం చేస్తున్నారు. ఆ ప్రదేశాలలోనే పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తిరువూరు మైలవరం వైపు నుండి వస్తున్న వారు వి.టి.పి.ఎస్. ఏ. కాలనీ వద్ద, విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ నుండి వచ్చు వారు ఇబ్రహింపట్నం ఫెర్రీ వద్ద మరియు నందిగామ జగ్గయ్యపేట వైపు నుండి వచ్చు వారు కేతన కొండ వద్ద పార్కింగ్ ను ఉపయోగించుకుని అక్కడ నుండి జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన బస్సులలో కౌంటింగ్ సెంటర్ కు చేరాలి.

సెక్షన్ 144 సి.ఆర్.పి.సి, సెక్షన్ 30పోలీస్ యాక్ట్ ఉన్నందున మరియు రెడ్ జోన్ గా ప్రకటించినందున ఆయా ప్రాంతాల ప్రజలు, కార్యకర్తలు, గుమిగూడి ఉండటాన్ని నిషేధించడమైనది. అభ్యర్ధులు ఏజెంట్లు పాస్ లను జిల్లా యంత్రాంగం వద్ద పొందాలని, అదేవిధంగా వాహనాలకు సంబంధించిన పాస్ లను తీసుకోవాలని తెలిపినారు. విధులలో పాల్గొనే ఉద్యోగస్తులు, పోలీసులతో సహా ఏజెంట్లను, అభ్యర్దులు అందరిని కౌంటింగ్ కేంద్రాలలోనికి ప్రవేశించే ముందు బ్రీత్ ఏనలైజర్ ద్వారా పరీక్ష చేయడం జరుగుతుంది. కౌంటింగ్ సెంటర్ దగ్గర FRC కూడిన ప్రత్యేక నిఘా కెమెరాలతో పటిష్టమైన బందోబస్త్ ను ఏర్పాటు చేయడం జరిగింది. మూడు డ్రోన్ కెమెరాలతో నిఘా పర్యవేక్షించడం జరుగుతుంది. జిల్లాలో పోలీస్ వారి 1500 సి.సి.కెమెరాలు, ఇతరుల 3000 సి.సి.కెమెరాలను మరియు కౌంటింగ్ సెంటర్ పరిసర ప్రాంతాలలో150 సి.సి.కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది.

కౌంటింగ్ సెంటర్ సమీపంలోని నివాసితులకు బయట నుండి వచ్చే వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వద్దని తెలియజేశారు.
ఇంకా ఈ సమావేశంలో సి.పి. ఎన్నికల లెక్కింపు రోజున అభ్యర్ధులు మరియు ఏజెంట్లు పాటించవలసిన ఈ క్రింది నిబంధనల గురించి విపులంగా తెలిపారు.
 ది: 4-6-2024 తేదిన ఉదయం 06.00 గంటల కల్లా కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని తెలిపినారు.
 కౌంటింగ్ కేంద్రానికి వచ్చు ఏజెంట్లు కలెక్టర్/ఆర్.ఓ.ఇచ్చిన ఐ.డి.కార్డు కలిగి ఉండాలని తెలిపినారు.
 అభ్యర్ధి లేదా కౌంటింగ్ ఏజెంట్ల సెక్యూరిటి సిబ్బందిని కౌటింగ్ కేంద్రాలలోకి గాని కౌంటింగ్ హాలు లోకి గాని అనుమతించబడరు.
 పార్టీ కార్యకర్తలను ఎవ్వరిని కౌంటింగ్ కేంద్రాల వద్దకు తీసుకురావద్దని కోరినారు.
 కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారిచే నియమించబడిన భద్రతా సిబ్బంది కలిగిన వ్యక్తులు ఎవ్వరూ కౌటింగ్ ఏజెంట్లు గా వ్యవహరించడానికి అనుమతించబడరు. వారు వ్యక్తిగతంగా తన భద్రత వదులుకోవాలి అని అనుకున్నా వారిని అనుమతించరు.
 ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరూ కౌంటింగ్ ఏజెంట్లు గా నియమించుకోకూడదని చెప్పినారు.
 కౌంటింగ్ ఏజెంట్లు మొబైల్ ఫోన్స్, లాప్ టాప్స్, ఐ పాడ్స్, ఆడియో మరియు వీడియో రికార్డ్ చేయగల ఎలెక్ట్రానిక్ పరికరాలను కౌంటింగ్ సెంటర్లకు తీసుకు రావద్దని తెలిపారు.
 ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఎన్నికల కౌంటింగ్ సమయంలో సంయమనంతోఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు వారికి సహకరించి, వారి ముందస్తు సూచనలు, సలహాలు పాటించాలని కోరారు.
 కౌంటింగ్ కేంద్రాలబయట గాని రోడ్ల మీద గాని విజయోత్సవ ర్యాలీలు చేయడం నిషేధం. బాణాసంచా కాల్చరాదని తెలియజేసినారు.
 ఫంక్షన్ హాల్స్ నందు గాని, హోటల్స్ నందు గాని జన సమీకరణ చేయకూడదని చెప్పినారు.
 పార్టీ కార్యాలయాల వద్ద గాని, ఫంక్షన్ హాల్స్ నందు గాని, సెంటర్ల వద్ద గాని ఎల్.ఈ.డి.స్క్రీన్స్ ఏర్పాటు చేయడం వలన శాంతిభద్రతల సమస్య తలెత్తుందని తెలిపారు.
 వాట్స్ యాప్ గ్రూప్ లలో గాని, సోషల్ మీడియా నందు గాని, మరే ఇతర సామజిక మాధ్యమాల యందు రెచ్చగొట్టే పోస్ట్ లను పెట్టరాదని తెలిపారు.
 ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున జూన్ 6వ తేదీ వరకు ఎటువంటి ర్యాలీలు, ఊరేగింపులు చేయటంగాని, బాణాసంచా కాల్చడంగాని చేయరాదని చెప్పారు.
 ఇతర పార్టీ కార్యాలయాల వద్ద గాని, నాయకుల నివాసముల వద్ద గాని కవ్వింపు చర్యలు చేయరాదని తెలిపినారు.
 వాహనాల యొక్క సైలెన్సర్లను తీసేసి శబ్ద కాలుష్యం చేయరాదు.
 కౌంటింగ్ ప్రక్రియలో వారికి ఎటువంటి ఇబ్బంది లేదా తేడాలు ఉన్నట్లయితే RO వారి దృష్టికి తీసుకువెళ్ళి నివృత్తి చేసుకోవాలి. అంతేగాని శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలాగా మరియు కౌంటింగ్ ప్రక్రియకు విఘాతం కలిగేలాగా చర్యలు చేయరాదని తెలిపారు.
 ఓడిపోయిన అభ్యర్ధులపై ఎటువంటి వ్యంగ్య వ్యాఖ్యలు చేయరాదని తెలిపారు.
 పోటీ చేయు అభ్యర్ధులు చట్టాలను ఉల్లంఘించకుండా ఉండే విధంగా వారి క్రింది కేడర్ కు అర్ధమయ్యే విధంగా చెప్పాలి, అవసరమైతే వీడియోల ద్వారా వారి కేడర్ సంయమనం పాటించేలా తగు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.
 ఆరోపణలు/అసత్యాలను, పుకార్లను వాట్స్ యాప్ గ్రూప్ లలో గాని, సోషల్ మీడియా నందు గాని, మరే ఇతర సామజిక మాధ్యమాల యందు గాని పెట్టరాదని తెలిపారు.
 వేరే ప్రాంత వ్యక్తులను ఎవ్వరినీ మన జూరిడిక్షన్ లోనికి తీసుకురావద్దు. దాని వలన శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని తెలిపారు.
 పార్టీ కార్యాలయాల వద్ద గానీ, బహిరంగంగా గాని, రాజకీయ నాయకుల ఇళ్ళ వద్ద గాని ఎటువంటి సమూహాలను ఏర్పాటు చేయరాదని చెప్పినారు.(గుమిగూడుట నిషిద్ధం)
 సున్నితమైన/ సమస్యాత్మక మైన ప్రదేశాలలో అభ్యర్ధులు వీలైనంతవరకు తిరగకుండా ఉండాలని కోరినారు.
 బాణాసంచా, మద్యం, DJ , లౌడ్ స్పీకర్లు, కర్రలు, రాళ్ళు మొదలైన వస్తువులను కలిగి ఉన్న ఎడల చట్టపరంగా తీసుకొను చర్యలకు మీరు భాద్యత వహించవలసి ఉంటుందని తెలిపారు.
 అభ్యర్ధి యొక్క మద్దతు దారులను ఇతర ప్రాంతాలకు పంపడం గాని, ఇతర ప్రాంతాల నుండి జనాలను తీసుకు రావడం చేయరాదని తెలిపారు.
 అభ్యర్ధులు తమ మద్దతుదారులకు వీడియో క్లిపింగ్స్ ద్వారా శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలుగకుండా అభ్యర్ధించవలెనని విజ్ఞప్తి చేసినారు.
ఈ సమావేశంలో హాజరైన అభ్యర్ధులలో లింగం శివ ప్రసాద్ మాట్లాడుతూ.. ఎం.పి.తరుపున పోటీచేసిన వారు నోవా కళాశాల నుండి నిమ్రా కలశాలకు చుట్టూ తిరిగిరాకుండా మధ్యలో ఒక బ్యారిగేట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలిపినారు. దీనిపై సి.పి.గారు దీనిపై కలెక్టర్ తో చర్చించి చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.

సెంట్రల్ నియోజిక వర్గ గొట్టుముక్కల రఘు మాట్లాడుతూ వచ్చే ఏజెంట్లను బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయాలని అడుగగా దీనిపై సి.పి. సానుకూలంగా స్పందించారు. నడవలేని వారిని వృద్ధులకు కౌంటింగ్ కేంద్రం గెట్ వరకు వాహనాలను అనుమతించాలని అడుగగా దీనిపై ఎన్నికల అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ ఐ.పి.ఎస్., డి.సి.పి.లు కె.శ్రీనివాసరావు ఐ.పి.ఎస్., అధిరాజ్ సింగ్ రాణా ఐ.పి.ఎస్., టి.హరికృష్ణ, కె.చక్రవర్తి, ఏ.డి.సి.పి.లు ఏ.సి.పి.లు, ఇన్స్పెక్టర్లు మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *