Breaking News

మద్య నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలుచేయాలి… : గాంధీ నాగరాజన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 30-1948 వ తారీఖున మహాత్మా గాంధీని అతిదారుణంగా గాడ్సే హత్య చేసిన రోజు. ఈ తేదీన వివిధ రూపాలలో, కళ్ళకు గంతలతో సత్యాగ్రహ పోరాటం గత కొంత కాలంగా గాంధీదేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గాంధీ నాగరాజన్ (నేటి గాంధీ) చేస్తున్నారు. ఆయన ప్రతినెలా 30వ తేదీన ఇలా దీక్షలు చేపట్టడం తెలిసిందే. గురువారం గాంధీ ఆశ్రమంలో గాంధీ నాగరాజన్ నిరాహారదీక్ష సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ కు మద్యాన్ని వెంటనే బ్యాన్ చేయమని, ముందస్తు జాగ్రత్తగా రౌడీషీటర్లని ఆరెస్టు చేయమని కోరినా పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికల నిబంధనలు అమలు చేసి యావత్తు భారత దేశంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులకు గడగడ లాడించిన మాజీ ఎన్నికల కమిషన్ టి ఎన్ శేషన్ గుర్తు వస్తారనీ, ఇప్పుడు వీళ్ళందరూ కమిషన్ ఏజెంట్లే అంటూ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కార్పొరేట్ పత్రిక వ్యవస్థ నశించాలని, దానికి మన మందరం కృషి చేయాలని ప్రజలకు ఈ నిరాహార దీక్ష మూలం గా పిలుపునిస్తున్నానన్నారు. రక్షించండి! రక్షించండి!! ప్రజా స్వామ్యాన్ని రక్షించండి!. బ్రతుకుదాం! బ్రతికిద్దాం!! బ్రతికించడం కోసం  బ్రతుకుదాం! బ్రతికితే దేశం కోసం చస్తే దేశం కోసం అని గాంధీ నినాదాలు చేశారు.  ఈ కార్యక్రమంలో ట్రస్ట్‌ ఎపి అధ్యక్షురాలు బంగారు భారతి, ట్రస్ట్‌ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *