Breaking News

సకాలంలో ఫలితాలు ప్రకటించుటకు అన్ని చర్యలు తీసుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓట్ల లెక్కింపు పటిష్టవంతంగా నిర్వహించి సకాలంలో ఫలితాలు ప్రకటించుటకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి జూన్ 4వ తేదీన కృష్ణా విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపు చేపట్టమన్న దృష్ట్యా, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో శనివారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కౌంటింగ్ సిబ్బంది రెండవ రాండమైజేషన్ నిర్వహించి ఆయా నియోజకవర్గాలవారీ ఓట్ల లెక్కింపు విధులకు సిబ్బందిని కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పటిష్టవంతంగా నిర్వహించాలని, ఫలితాలు సకాలంలో ప్రకటించుటకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ఓట్ల లెక్కింపు సిబ్బందికి జూన్ 2వ తేది ఆదివారం మచిలీపట్నంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివిధ ప్రదేశాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. వివిధ పార్టీల అభ్యర్థులకు, స్వతంత్రులకు, వారి పోలింగ్ ఏజెంట్లకు కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, వీరికి శిక్షణ సమాచారం చేరవేయాల న్నారు.

11-మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం ఓట్ల లెక్కింపు సిబ్బందికి జడ్పీ కన్వెన్షన్ హాల్,

71-గన్నవరం నియోజకవర్గం ఓట్ల లెక్కింపు సిబ్బందికి కలెక్టరేట్లో స్పందన మీటింగ్ హాలులో,

72-గుడివాడ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు సిబ్బందికి జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో,

74-పెడన నియోజకవర్గం ఓట్ల లెక్కింపు సిబ్బందికి స్థానిక లేడీ యాంప్థిల్ జూనియర్ కళాశాలలో,

75-మచిలీపట్నం నియోజక వర్గం కౌంటింగ్ సిబ్బందికి స్థానిక నోబుల్ కళాశాల(సైన్స్ బ్లాక్),

76-అవనిగడ్డ నియోజకవర్గం సిబ్బందికి స్థానిక చిలకలపూడి పాండురంగ మున్సిపల్ హైస్కూల్,

77-పామర్రు నియోజకవర్గ సిబ్బందికి స్థానిక నిర్మల హైస్కూల్,

78- పెనమలూరు నియోజకవర్గం కౌంటింగ్ సిబ్బందికి నోబుల్ కళాశాల (లైబ్రరీ బిల్డింగ్) నందు శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. కావున కౌంటింగ్ సిబ్బంది ఈ శిక్షణకు హాజరు కావాలన్నారు.

జాయింట్ కలెక్టర్, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి గీతాంజలి శర్మ, డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, మచిలీపట్నం, గుడివాడ, పెనమలూరు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, ఆర్డీవోలు ఎం. వాణి, పి. పద్మావతి, డి. రాజు, పామర్రు రిటర్నింగ్ అధికారి శ్రీదేవి, అవనిగడ్డ రిటర్నింగ్ అధికారి బాలసుబ్రమణ్యం, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సమన్వయ అధికారి దుర్గా కిషోర్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *