విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షపు నీరు రోడ్లమీద నిలవకుండా ఉండేందుకు మొదలుపెట్టిన ఆపరేషన్ డీసెల్టింగ్ లో భాగంగా సోమవారం విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఆదేశాల మేరకు విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో డీసిల్టింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సర్కిల్ వన్ పరిధిలో సివిఆర్ ఫ్లై ఓవర్, ఎలక్ట్రిక్ లోకోమోటివ్ షేడ్ దగ్గర, సితార నుండి కబేల వరకు, క్రాంబే రోడ్, ఎన్ హెచ్ 65 ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ నుండి వెంకటేశ్వర ఫౌండ్రీ రోడ్ వరకు, జీరో బల్బ్ ఏరియా, జండా చెట్టు, సుబ్రహ్మణ్యం స్ట్రీట్ దగ్గరున్న డ్రైన్ లలో డీ సిల్టింగ్ పనులను చేశారు. సర్కిల్ 2 పరిధిలో రామవరప్పాడు ఫ్లైఓవర్ దగ్గర నుండి ఎం పి ఎల్ ఎంప్లాయిస్ గుణదల హౌరా రైల్వే ట్రాక్ దగ్గర, ముస్తాబాద్ దగ్గర IRR, వాంబే కాలనీ హెచ్ బ్లాక్, న్యూ రాజరాజేశ్వరి పేట రైల్వే ట్రాక్ ఉన్న డ్రైన్ లాలో జెసిబి లతో డి సిల్టింగ్ చేశారు.
సర్కిల్ 3 పరిధిలో ఉన్న బెంజ్ సర్కిల్ ట్రెండ్ సెట్ మాల్ దగ్గర నుండిరాజధాని టీ స్టాల్ వరకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు దగ్గర నుండి స్వీట్ మ్యాజిక్ వరకు ఉన్న డ్రైన్స్ నుండి డిసిల్టింగ్ చేశారు. వర్షపు నీరు రోడ్డు మీద నిలవకుండా డ్రైన్ లలో ఎటువంటి ఆటంకాలు లేకుండా వర్షపు నీరు ప్రవహించేటట్టుగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చేస్తున్న ఆపరేషన్ డీసిల్టింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News