Breaking News

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా న్యాయ వాదులకు 40 గంటల మధ్యవర్తిత్వ శిక్షణ కార్యక్రమం

-జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మధ్యవర్తిత్వం మరియు రాజీ మార్గం కమిటీ (M.C.P.C) మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం నందు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత వారి ఆధ్వర్యంలో ది.18.06.2024 నుంచి 22.6.2024 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించే మధ్యవర్తిత్వ శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా సమయం వృధాకాదని, త్వరగా ప్రయోజనం చేకూరుతుందని, ఖర్చులు ఉండవని, కేసులను సామరస్యంగా పరిష్కరించు కోవచ్చని అన్నారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో, తూర్పుగోదావరి ప్రాంతానికి చెందిన న్యాయవాదులకు మధ్యవర్తిత్వ నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి పొటెన్షియల్ ట్రైనర్లు శ్రీమతి గీతాదేవి, బెంగుళూరు నుండి బి శ్రీకుమార్, చెన్నైకి చెందిన సీనియర్ ట్రైనర్ శ్రీమతి ఆర్. విజయ కమల ఆధ్వర్యంలో 40 గంటల మధ్యవర్తిత్వ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియ చేశారు.

శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ శ్రీమతి ఏ.. గాయత్రీ దేవి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.ప్రకాష్ బాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి న్యాయ వాదులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *