Breaking News

అన్నా క్యాంటిన్ల పునర్ వ్యవస్థీకరణ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాఅన్నా క్యాంటిన్ల పునర్ వ్యవస్థీకరణ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాల…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నా క్యాంటిన్ల పునర్ వ్యవస్థీకరణ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత సూచనలు చేశారు. మంగళవారం ఉదయం కలెక్టరు కార్యాలయ ఛాంబర్ నుంచి మునిసిపల్ కమిషనర్ లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత సమీక్ష నిర్వహిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మునిసిపల్ కార్పొరేషన్, పురపాలక సంఘాల ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన అన్నా క్యాంటిన్లని తిరిగి పునర్ వ్యవస్థీకరణ కోసం అవసరమైన చర్యలు, మౌలిక వసతులు కల్పించడంలో ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందన్నారు. ఆమేరకు క్షేత్ర స్థాయిలో ఆయా అన్నా క్యాంటీన్ల యదార్థ స్థితి, అందుకు అనుగుణంగా చేపట్టవలసిన పనులపై నివేదిక రాష్ట్ర మునిసిపల్ పరిపాలన శాఖ అందజేయ్యాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్ లు వివరాలు తెలియ చేస్తూ, రాజమహేంద్రవరం లో 3 , నిడదవోలు, కొవ్వూరు లలో ఒక్కొక్కటి చొప్పున అన్నా క్యాంటీన్లు గతంలో నిర్వహించినట్లు తెలిపారు. ఆయా అన్నా క్యాంటీన్లు పునర్ వ్యవస్థీకరణ కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో ఆర్ ఎమ్ సి మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, కొవ్వూరు – కె.డానియల్ జోసఫ్, నిడదవోలు – టి రామ్ గోపాల్ రెడ్డి లు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *