-జిల్లాకు చెందిన 98 వేల 612 మంది రైతుల ఖాతాలో రూ.19.72 కోట్లు జమ
-కలెక్టరు మాధవీలత
రాజమహేంద్రవరం / రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 మండలాలకు చెందిన 98,612 మంది రైతుల బ్యాంకు ఖాతాలలో రూ.1,972 లక్షల 24 వేలు 17 వ విడత పి ఎం కిసాన్ పథకం యొక్క ఆర్ధిక ప్రయోజనం రెండు వేల రూపాయల చొప్పున జమ చెయ్యడం జరిగిందని మంగళవారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలియ చేశారు.
మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగే ‘కిసాన్ సమ్మేళన్’లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా రైతులకు PM-KISAN పథకం యొక్క 17వ విడతను ఆర్ధిక ప్రయోజనం జమ చెయ్యడం జరిగిందని అన్నారు. రాజానగరం మండలం కలవచెర్ల KVK( కృషి విజ్ఞాన కేంద్రం) భవనంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రైతులతో కలిసి జిల్లా వ్యవసాయ అధికారులు , రైతులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ డా కే.మాధవీలత వివరాలు తెలియ చేస్తూ, తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 98612 మంది లబ్ధిదార రైతులకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున రూ. 19 కోట్ల 72 లక్షల 24 వేలు జమ చేశారన్నారు. రైతుల్లో ఈ పథకం గురించి అవగాహన కల్పించడం, పెట్టుబడి సహాయం కింద ఒనగూరే ప్రయోజనం పై ప్రభుత్వము యొక్క ముఖ్య ఉదేశ్యాన్ని రైతులకు వివరించడం జరిగింది.
రాజానగరం మండలం కలవచేర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) భవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు రైతులతో కలిసి వీక్షించడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 107 ప్యాక్స్ లలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
మండలాల వారీగా పి ఎం కిసాన్ 17 వ విడత ప్రయోజనం పొందిన వారీ వివరాలు:
అనపర్తి 4,183 మంది రైతులు రూ.83,66,000
బిక్కవోలు 5,572 ఒక కోటి 11 లక్షల 44 వేలు
రంగంపేట 6,370 మందికి ఒక కోటి 27 లక్షల 40 వేలు
రాజమండ్రి రూరల్ 1,896 మందికి 37 లక్షల 92 వేలు
కడియం 5,234 మందికి ఒక్కోటి నాలుగు లక్షల 68,000
రాజానగరం 8,472 మందికి ఒక కోటి 69 లక్షల 44 వేలు
కోరుకొండ 6,300 మందికి ఒక కోటి 26 లక్షలు
సీతానగరం 5,049 మందికి ఒక కోటి 98 వేలు
జగ్గంపేట – గోకవరం మండలం 7,011 మందికి ఒక కోటి 40 లక్షల 22 వేలు
దేవరపల్లి 6,250 మందికి ఒక కోటి 25 లక్షలు
గోపాలపురం 5,273 మందికి ఒక్కోటి 5 లక్షల 46 వేలు
నల్లజర్ల 6,761 మందికి ఒక కోటి 35 లక్షల 22 వేలు
కొవ్వూరు 5,297 మందికి ఒక కోటి 5 లక్షల 94 వేలు
చాగల్లు 5,163 మందికి ఒక కోటి మూడు లక్షల 26 వేలు
తాళ్లపూడి 4,116 మందికి 82 లక్షల 32 వేలు
ఉండ్రాజవరం వరం 5,077 మందికి ఒక కోటి లక్ష 54 వేలు
నిడదవోలు 5,241 మందికి ఒక కోటి 4 లక్షల 82 వేలు
పెరవలి 5,347 మందికి ఒక కోటి ఆరు లక్షల 94 వేలు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, ప్రిన్సిపాల్ సైన్సిస్ట్ డా నాయుడు, ఏ డి ఏ శ్రీనివాస రెడ్డి, మండల వ్యవసాయ అధికారి శాంత, స్ధానిక నాయకులు మోడీ సత్తి బాబు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News