Breaking News

యోగశక్తి చికిత్స 17వ ఆరోగ్య శిబిరము

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
10వ అంతర్జాతీయ యోగదినోత్సవంలో భాగంగా 17వ రోజు ప్రభుత్వ ఆయుష్ ఆయుర్వేద హాస్పిటల్, కోలవెన్ను వద్ద యోగ విధానాలతో రోగులకు చికిత్స అందించినట్లు యోగశక్తి సాధన సమితి వ్యవస్తాపక చైర్మన్ డా. మాకాల సత్యనారాయణ తెలిపారు. పెరాలసిస్, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఫ్రొజెన్ షోల్డర్స్ మరియు ఇతర నొప్పులు తగ్గించి, ఎవరికి వారు ఎలా తగించుకోవాలో తర్పీదు ఇవ్వబడినది. సుమారు 100మందికి మోడీ స్టిక్ అందించారు. ఈ క్యాంపు లో ఇంచార్జ్ లావణ్య ,ట్రైనీ డాక్టర్స్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత కంకిపాడు లో జరిగిన మరొక శిబిరంలో నాడీ పరీక్ష చేసి చికిత్స అందించారు. ఈ శిబిరంలో యలమంచిలి కిషోర్, యోగ గురువు బాలసురేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *