Breaking News

డ‌యేరియా వ్యాప్తి చెంద‌కుండా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు

– విస్తృతంగా స్టాప్ డయేరియా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు
– బాధితుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించాలి
– నిర్ల‌క్ష్యం లేకుండా అప్ర‌మ‌త్త‌త‌తో వ్య‌వ‌హరించాలి
– అధికారుల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు ఆదేశాలు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో డ‌యేరియా వ్యాప్తి చెంద‌కుండా క్షేత్ర‌స్థాయిలో ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు చేపట్టాల‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. శుక్ర‌వారం రాష్ట్ర స‌చివాల‌యం నుంచి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీర‌భ్ కుమార్ ప్ర‌సాద్‌.డ‌యేరియాపై జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ వీసీకి క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యం నుంచి అధికారుల‌తో క‌లిసి ఎస్‌.డిల్లీరావు హాజ‌ర‌య్యారు. అతిసార కేసులు న‌మోదు కాకుండా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై సీఎస్ మార్గ‌నిర్దేశ‌నం చేశారు. అదే విధంగా జులై 1 నుంచి ఆగ‌స్టు 31 వ‌ర‌కు నిర్వ‌హించే రాష్ట్ర వ్యాప్త ప్ర‌చార కార్య‌క్ర‌మంపై సూచ‌న‌లిచ్చారు. వీసీ అనంత‌రం క‌లెక్ట‌ర్ డిల్లీరావు జిల్లా వైద్య ఆరోగ్యం, పంచాయ‌తీరాజ్ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షించారు. ప‌టిష్ట ప్ర‌ణాళిక ప్ర‌కారం జిల్లాలో అతిసారం వ్యాప్తి చెంద‌కుండా వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌న్నారు. డయేరియాపై ప్ర‌జ‌ల‌కు పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని.. సుర‌క్షిత తాగునీరు, చేతుల ప‌రిశుభ్ర‌త త‌దిత‌రాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. తాగునీరు స‌ర‌ఫ‌రా, పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాల అమ‌లుపై అధికారులు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. కేసులు న‌మోదైన చోట మూలాల‌ను గుర్తించి.. స‌త్వ‌రం ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాల‌ని స్ప‌ష్టం చేశారు. బాధితుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించ‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హించ‌కుండా అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హరించాల‌న్నారు. ఓఆర్ఎస్‌, జింక్ ప్యాకెట్ల పంపిణీపై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌న్నారు. చిన్నారులు విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండేలా చూడాలన్నారు. ప‌టిష్ట ప‌ర్య‌వేక్ష‌ణ‌, కార్యాచ‌ర‌ణ‌పై దృష్టిసారించాల‌ని ఆదేశించారు. ఆరోగ్య శాఖ అధికారుల భాగ‌స్వామ్యంతో ఐసీడీఎస్ అధికారులు అంగ‌న్వాడీ కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు/జింక్ కార్నర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. డ‌యేరియా ప్ర‌భావిత ప్రాంతాల్లో ఇంటింటి స‌ర్వే నిర్వ‌హించాల‌ని.. అవ‌స‌రం మేర‌కు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి.. నిరంత‌ర వైద్య సేవ‌లు అందించాల‌ని ఆదేశించారు. స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు క్షేత్ర‌స్థాయిలో అందుబాటులో ఉండాల‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు స్ప‌ష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *