Breaking News

రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమ నిర్వహణ నేపథ్యంలో అధికారులు ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టాలి

-ఇంఛార్జి కలెక్టర్ ధ్యాన చంద్ర

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
డయేరియా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత కార్యదర్శులు, అధికారులతో కలిసి వర్చువల్ విధానంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి సంబంధిత శాఖలతో కలిసి తిరుపతి జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ధ్యాన చంద్ర హెచ్ఎం హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఇంఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు డయేరియా నియంత్రణపై రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో సంబంధిత ఆర్ డబ్ల్యు ఎస్ శాఖ , వైద్య ఆరోగ్య శాఖ, పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖ తదితర శాఖల అధికారులు తగు చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ శ్రీహరి, డిప్యూటీ సిఈఓ ఆది శేషారెడ్డి, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిణి జయలక్ష్మి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి శాంత కుమారి, డివిజనల్ పంచాయితీ అధికారిణి రూపా రాణి, ఆర్డబ్ల్యూఎస్ డిఈ భాస్కర్ రెడ్డి, డిప్యూటీ డిఈఓ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *