Breaking News

యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం

-పని వత్తిడిని అధిగమించడం యోగాతో సాధ్యం
-యోగాను అలవాటుగా మార్చుకోవాలి
-అదనపు కమిషనర్ పి ఎమ్ సత్యవేణి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
యోగాతో శారీరక, మానసిక ప్రశాంతత పాటు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ప్రతి ఒక్కరూ యోగా చేయడం వలన శారీరక ఒత్తిడి లను అధిగమించవచ్చునని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పీఎం.సత్యవేణి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక జెకే గార్డెన్స్ లో నగరపాలక సంస్థ, జిల్లా ఆయుష్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 10 వ అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పీ.ఎం. సత్యవేణి మాట్లాడుతూ యోగ అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో కూడుకుని, మనుషులలో ఉన్నటువంటి ఒత్తిడిని, ఆందోళనను తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 2014 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్న మన్నారు. ప్ర‌తీఒక్క‌రూ యోగా చేయ‌వ‌చ్చున‌ని, ఎవ‌రికీ ఎటువంటి ప‌రిమితులు లేవ‌ని అన్నారు. దేశ ప్రధాని పిలుపు, విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్య సమితి అధ్వర్యంలో అద్భుత ఫ‌లితాల‌ను ఇచ్చే యోగా ఇప్పుడు విశ్వ‌వ్యాపితం అయ్యింద‌ని చెప్పారు. ఇందుకు మ‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఎన‌లేని కృషి చేశార‌ని పేర్కొన్నారు. ప్ర‌తీఒక్క‌రూ యోగాఅభ్య‌సన ద్వారా త‌మ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర్చుకోవాల‌ని కోరారు.

కరోనా వంటి విపత్కరమైన పరిస్థితుల్లో యోగ సాధకులు కరోనాని జయించిన సందర్భాలు మనం చూడటం జరిగిందన్నారు. యోగా సాధన వలన ఉద్యోగ, మానసిక, వ్యక్తిగత ఒత్తుడులను జయించవచ్చునని పేర్కొన్నారు. కమిషనర్ గారి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ పరిధిలో గల ప్రతి పాఠశాలలో విద్యార్థులకు యోగ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. యోగ పట్ల ఆసక్తి చూపే ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి, సిబ్బందికి తగిన సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు.

జిల్లా ఆయుష్ అధికారి డా. సిహెచ్. రమేష్ మాట్లాడుతూ “స్వయం మరియు సమాజం కోసం యోగా” అన్న థీమ్‌తో ఈ ఏడాది 2024 యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించు కుంటున్నట్లు పేర్కొన్న మన్నారు. యోగ  శరీరం, మనస్సుతో పాటు ఆత్మను ఏకీకృతం చేస్తుందన్నారు. మన ఆరోగ్య శ్రేయస్సు కోసం యోగా సమగ్ర విధానాన్ని అందజేస్తుందన్నారు. ఇది మన వేగవంతమైన జీవితాలకు శాంతి మరియు ప్రశాంతతను అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా పలువురు యోగసాధకులను మెమెంటో లను అందించిఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డా. సి హెచ్. రమేష్, జిల్లా క్రీడా అధికారి డిఎంఎం శేషగిరిరావు, ఇతర జిల్లా అధికారులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *