Breaking News

2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ ప్రైవేటు ఐటిఐలలో అడ్మిషన్లు..

-జూన్ 24, 25 తేదీల్లో మొదటి విడత అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా పరిధి లోని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఐ.టి.ఐ లలో చేరేందుకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఈ నెల 24, 25 తేదిల్లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఐ.టి.ఐ లో కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుందని పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ ఎల్.ఆర్.ఆర్. క్రిష్ణన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేటు ఐ.టి.ఐ లో ప్రవేశాల కోసం ధరఖాస్తు చేసుకుని సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిన అభ్యర్ధులు అందరు పదో తరగతి మార్కుల జాబితా, టిసి, స్టడీ సర్టిఫికెట్, కుల దృవీకరణ పత్రం, ఆధార్ కార్డు మరియు వాటితో పాటు సర్టిఫికెట్ పరిశీలన తర్వాత ఇచ్చిన దృవీకరణ పత్రం అన్నీ ఓరిజినల్స్ తో పాటు ఒక జత జిరాక్స్ కాపీల తో కౌన్సెలింగ్ కు హాజరు కావాలని పేర్కొన్నారు.

కౌన్సిలింగ్ షెడ్యూల్ వివరాలు :-

ప్రామాణిక గ్రేడ్ పాయింట్స్ ఆధారంగా..

జిపిఏ 10 నుంచి 7 వరుకు ఉండి 1 నుంచి 136 వరకు ర్యాంక్ గల విద్యార్థులు జూన్ 24 వ తేదీన ఉదయం 9.00 గంటలకు..

జిపిఏ 6.8 నుంచి 5.7 వరుకు ఉండి 137 నుంచి 270 వరకు ర్యాంక్ గల విద్యార్థులు
జూన్ 24 వ తేదీన మధ్యాహ్నం 1.00 గంటకు..

జిపిఏ 5.7 నుంచి 4.7 వరుకు ఉండి 271 నుంచి 405 వరకు ర్యాంక్ గల విద్యార్థులు
జూన్ 25 వ తేదీన ఉదయం 9.00 గంటలకు..

జిపిఏ 4.7 నుంచి 1.6 వరుకు ఉండి 406 నుంచి 543 వరకు ర్యాంక్ గల విద్యార్థులు
జూన్ 25 వ తేదీన మధ్యాహ్నం 1.00 గంటకు.. తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐ.టి.ఐ) లో నిర్వహించు కౌన్సెలింగ్ కు హాజరుకావాలని తెలిపారు.

ఎటువంటి ఫోన్ కాల్స్ మరియు మెసేజ్ లు రానీ అభ్యర్థులు వారి పదవ తరగతి గ్రేడ్ పాయింట్స్ ప్రకారం ఇచ్చిన తేదీలలో పైన తెలిపిన షెడ్యూల్ ప్రకారం తమ యొక్క సర్టిఫికేట్ కాపీ ల తో నేరుగా ప్రభుత్వ ఐటిఐ రాజమహేంద్రవరం కు హాజరు కావలెనని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *