Breaking News

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులను అమ్మకాన్ని ఖండిస్తున్నాం

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
పలు ప్రాంతాల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఉన్న ఆస్తులను విడతల వారీగా తెగనమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్ను అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. విశాఖపట్నంతోపాటు హైదరాబాద్, చెన్నై, రాయబారిలో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆస్తులను కూడా విడతల వారీగా అమ్మేందుకు పూనుకుంటోంది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసి నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పై ఉక్కుపాదం మోపడం దుర్మార్గం. విశాఖలో ఉన్న స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ సెక్రటేరియట్ భవనాలు నిర్మిస్తే బాగుంటుందని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నుండి కాపాడుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. 32 మంది ప్రాణత్యాగాలతో ఆంధ్రుల హక్కుగా బాసిల్లుతున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి మాట్లాడాల్సిన అవసరం ఎంతో ఉంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి కేంద్ర స్టీల్ మంత్రిని కలిసామని చెబుతున్నారు. కానీ విశాఖపట్నం ప్రైవేటీకరణ అంశం విషయమై ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఒత్తిడి చేయలే గాని కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిసి కాదని స్పష్టం చేస్తున్నాం.

గతంలో లాభాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ లో స్టీల్ ఉత్పత్తి తగ్గిస్తూ 2023-24 సంవత్సరానికి ప్లాంట్ నష్టాల్లో ఉందని చెబుతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ దురుద్దేశ పూర్వకమైన చర్యగా పరిగణిస్తున్నాం. మరోపక్క జిందాల్ కు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సెయిల్ కు అప్పగించి నిర్వహించాలి. లేదంటే విశాఖ ఉక్కుకు అవసరమైన గనులను కేటాయించి అభివృద్ధి పరచాలని డిమాండ్ చేస్తున్నాం.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఏపీకి చెందిన ఎంపీల సహకారంతో ప్రధాని నరేంద్ర మోడీని కలిసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపేందుకు కృషి చేయాలని కోరుతున్నాం.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *