Breaking News

ఇండియన్ బ్యాంక్ స్వయం సహాయక సంఘాల మెగా రుణా మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
28.06.2024న తిరుపతి నగరం తుడా ప్రాంగణం లోని కచ్చాపి ఆడిటోరియం నందు SHG రుణా మేళా ఇండియన్ బ్యాంక్ వారి అధ్వర్యం లో జరిగింది. ముఖ్య అతిధులుగా ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ RBD వి చంద్రశేఖర్, ఫీల్డ్ జనరల్ మేనేజర్ జి రాజేశ్వర్ రెడ్డి, తిరుపతి మెప్మా పిడి ఎ రాధమ్మ, చిత్తూరు డిఆర్‌డిఎ పిడి డిఎంకె తులసి విచ్చేసారు. తిరుపతి జోనల్ మేనేజర్ ఎం సెల్వరాజ్ మరియూ డిప్యూటీ జోనల్ మేనేజర్ బాల చంద్ర మోహన్ పాలుగొన్నారు.

ఇండియన్ బ్యాంక్ GM చంద్రశేఖర్ మాట్లాడుతూ SHG రుణా వితరణలో దేశంలో మన తెలుగు రాష్ట్రాలే ప్రథమ స్థానంలో ఉన్నాయన్నారు. అలాగే SHG సభ్యుల కోసం లక్షపతి దీదీ పథకం ద్వార రూ. 5 లక్షలు వరకు రుణ సదుపాయం కళ్లిగించడం జరుగుతుందని చెప్పారు. ఇండియన్ బ్యాంక్ FGM రాజశేఖర్ మాట్లాడుతు వివిధ పిడి ల సహకారాన్ని ప్రశంసించారు. ప్రతి ఎస్‌హెచ్‌జి సభ్యురాలు ఇండియన్ బ్యాంక్ మొబైల్ యాప్ ఇండ్ స్మార్ట్ నువు విరివిగా ఉపయోగించుకోవాలని కోరడం జరిగింది.

తిరుపతి మెప్మా పీడీ రాధమ్మ మాట్లాడుతు బ్యాంకు రుణాలను సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థికంగా బాలోపేతం కావాల్సిందిగా విన్నవించారు. బ్యాంక్ మొబైల్ యాప్ ని బాగా ఉపయోగించమని కోరడం జరిగింది.
తిరుపతి డిఆర్‌డిఎ పిడి శ్రీమతి ప్రభావతి గారు మాట్లాడుతు ఇంత పెద్ద ఎత్తున రుణ వితరణ కార్యక్రమం చేసిన ఇండియన్ బ్యాంక్ ని కొనియాడారు. వారికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.
చిత్తూరు డిఆర్‌డిఎ పిడి డిఎంకె తులసి మాట్లాడుతు చక్కటి అర్ధిక ప్రణాళికతో ప్రతి బృందం సభ్యురాలు అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమం లో భాగం గా హైదరాబాద్ FGMO పరిధిలో వివిధ బ్యాంకు జోన్లు మొత్తం గా రూ. 610 కోట్లు ఒకరోజులో రుణ వితరణ చెయ్యడం జరిగింది. అందులో జోనల్ వారిగ తిరుపతి రూ. 205 కోట్లు, అమరావతిలో రూ. 75 కోట్లు, విజయవాడ లో రూ.90 కోట్లు, కరీంనగర్ లో రూ. 90 కోట్లు, రాజమండ్రి రూ. 85 కోట్లు, విశాఖపట్నం రూ. 70 కోట్లు, హైదరాబాద్ రూ. 45 కోట్లు రుణ వితరణ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తమ SHG లను సత్కరించడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *