Breaking News

ఉచిత ఇసుక వినియోగ దారులకు, గృహ నిర్మాణ లబ్దిదారులకు అందుబాటులోకి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పెండ్యాల, పందలపర్రు ఇసుక స్టాక్ పాయింట్స్ వద్ద ఈరోజు నుంచి ఉచిత ఇసుక వినియోగ దారులకు, గృహ నిర్మాణ లబ్దిదారులకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందని ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, ఆర్ ఎం సి మునిసిపల్ కమిషనర్ కె.. దినేష్ కుమార్ తెలియ చేసారు. మంగళవారం సాయంత్రం నిడదవోలు మండలం పరిథిలో ని పెండ్యాల, పందలపర్రు స్టాక్ పాయింట్ లని సబ్ కలెక్టరు అశుతోష్ శ్రీవాత్సవ తో కలిసి ప్రారంభించారు

ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, ఈరోజు నుంచి గృహ వినియోగదారులకి ఇండ్ల నిర్మాణం కోసం అవసరమైన ఇసుకను ఉచితంగా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందన్నారు. ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల వరకూ ఇసుక తీసుకొని వెళ్ల వచ్చునని, ఇందుకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందన్నారు. ఉచిత ఇసుక కోసం కోరే వ్యక్తులు సంబంధిత ధ్రువపత్రాలు అంద జేయాల్సి ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు అశుతోష్ శ్రీవాత్సవ, తహశీల్దార్ వి. నాగభూషణం, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *