Breaking News

రేణిగుంట విమానాశ్రయం పెండింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలి: కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రేణిగుంట విమానాశ్రయం సంబంధించిన హార్టికల్చర్, లైటింగ్ సంబంధిత పనులు త్వరిత గతిన పూర్తి చేయాలి అని జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు విసి తుడా, ఆర్ అండ్ బి అధికారులతో విమానాశ్రయ బ్యూటిఫకేషన్, తగినంత లైటింగ్ ఏర్పాటుపై సమీక్షిస్తూ రేణిగుంట విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో తుడా అధికారులు హార్టికల్చర్ మొక్కల మెయింటెనెన్స్, బ్యూటిఫికేషన్ చర్యలు కొనసాగేలా తీసుకోవాలని, అలాగే మీడియన్ లైట్ల ఏర్పాటు త్వరిత గతిన ఏర్పాటు చేసి లైటింగ్ బ్లాక్ స్పాట్స్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రహదారులు భవనాల శాఖ వారు ఎయిర్ పోర్టు సమీప కూడలిలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విసీ తుడా ఇంఛార్జి వెంకటేశ్వరులు, ఆర్ అండ్ బి డి.ఈ నాగమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *