-నూతన పరిశ్రమల స్థాపనకు తిరుపతి జిల్లా అనుకూలం: జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలనీ, నూతన పరిశ్రమల స్థాపనకు తిరుపతి జిల్లా అనుకూలమైన జిల్లా అని జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ పరిశ్రమల శాఖ అధికారులను ఉద్దేశించి పేర్కొన్నారు.
మంగళవారం సాయంత్రం పరిశ్రమల శాఖ, ఏపీఐఐసి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహిస్తూ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలనీ, నూతన పరిశ్రమల స్థాపనకు తిరుపతి జిల్లా అనుకూలమైనదని అన్నారు. ప్రభుత్వం సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు కావాల్సిన అనుమతులను సకాలంలో అందజేస్తూ పారిశ్రామిక వేత్తలకు తోడ్పాటునిస్తూ యువతకు ఉపాధి కల్పించే దిశలో అనేక చర్యలు చేపడుతోందని, గౌ. ముఖ్యమంత్రి వర్యులు నూతన పరిశ్రమల స్థాపనకు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.
పరిశ్రమల శాఖ, ఏపీఐఐసి ద్వారా చేపట్టిన కార్యక్రమాల వివరాలను, వారి విధులను అధికారులు కలెక్టర్ కు వివరించగా కలెక్టర్ గారు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (విసిఐసి) శ్రీకాళహస్తి నోడ్, చెన్నై బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ -కృష్ణ పట్నం నోడ్ (సిబిఐసి- క్రిస్ సిటి), స్పెషల్ ఎకనామిక్ జోన్ లైన శ్రీ సిటీ, మేనకూరు, తడ ఎస్ఈజడ్ ల ప్రస్తుత స్థితి గతులపై సమీక్షించారు. ఇనగలూరు హిల్ టాప్ సెజ్,ఈఎంసి 1&2, పాగాలి ఇండస్ట్రియల్ పార్క్, చంద్రగిరి నందు ఏర్పాటు చేయబోతున్న ఐటి పార్క్, తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షిస్తూ అధికారులు ప్రణాళికా బద్ధంగా పురోగతి సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి, ఏపీఐఐసి జడ్ఎం చంద్ర శేఖర్, డిప్యూటీ జడ్ఎం లు, ఇండస్ట్రియల్ ప్రమోషన్ అధికారులు, తదితర సంబంధిత అధికారులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News