Breaking News

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర మంత్రులు అందుబాటులో ఉండనున్నారు. అందులో భాగంగా నేడు బీసీ సంక్షేమ, జౌళి&వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి సంజీవరెడ్డి సవిత నేడు ప్రజా దర్బార్ ను మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో అర్జీదారులు పోటెత్తి తమ సమస్యలు మంత్రి సవిత వద్ద విన్నవించారు. వారి నుండి మంత్రి స్వయంగా అర్జీలను స్వీకరించి వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..

మంత్రి ఎస్.సవిత మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రం బాగుండాలన్నదే చంద్రబాబు ముఖ్య ఆకాంక్ష.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టగలరని ప్రజలు నమ్మి అఖండ విజయాన్ని అందించారు. ఇది ప్రజల పాలన.. మా నాయకుడు మాకు సూచించింది ఒక్కటే కక్ష సాధింపు వద్దు… ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ఒక్కొక్కటిగా వాటిని పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. అందులో భాగంగా నేడు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రజాదర్భాన్ ను నిర్వహించాం. వచ్చిన ఫిర్యాదుల్లో అధికంగా వైసీపీ నేతల భూకబ్జాలు, గంజాయి, అమ్మాయిల మిస్సింగ్ తో పాటు అనేకం ఉన్నాయి. నా పరిధిలో ఉన్నవి నేను వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించా.. లీగల్ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం.

రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. రాజే బాగలేకుంటే రాజ్యం ఎలా బాగుంటుంది. గత ఐదేళ్లు జగన్ రెడ్డి ఏం చేశాడో.. ఆయన 150మంది ఎమ్మెల్యేలు అదే చేశారు. నేడు రాజు బాగున్నాడు. ఆయన దశాదిశ మాకు నిర్ధేశిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికోసం మేము ముందుకెళ్తున్నాం. కూటమి నేతలు చెప్పిన విధంగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. దానికి నిదర్శనం చంద్రబాబు అధికారం చెప్పట్టిన వెంటనే పెట్టిన ఐదు సంతకాలు, పెంచి ఇచ్చిన పింఛన్, ఉచిత ఇసుక, ధాన్యం బకాయిల చెల్లింపులు ఈ మాదిరిగానే అన్న క్యాంటీన్లను కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. అభివృద్ధే ధ్యేయంగా పనిచేయబోతున్నాం.

అనంతపురం జిల్లా నుండి కూడా భూ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. వాటి పరిష్కారానికి కృషి చేస్తా. ఈ ఐదు సంవ్సరాల్లో ల్యాండ్, వైన్, మైన్స్, శ్యాండ్, గంజాయిలతో.. వారు దోచుకోవడం దాచుకోవడం తప్ప ఈ రాష్ట్రానికి వైసీపీ నేతలు చేసిన మేలు ఒక్కటి లేదు. ఎక్కడ చూసినా భూ దందాలు, గంజాయే కనిపిస్తుంది. వచ్చిన ఫిర్యాదులు అన్నీ అవే. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన వైసీపీ నేతలు మాట్లాడడానికి కూడా అనర్హులు. వారి గురించి మేము మాట్లాడాల్సిన అవసరంలేదు. ప్రజలు ఎన్డీఏ కూటమిని నమ్మి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. ప్రజలు ఏమి ఆశిస్తున్నారో మాకు అర్థం అయ్యింది. ప్రజల ఆశలను నిలబెడతామన్న నమ్మకం మాకు ఉంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *