అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ ఎంపవర్మెంట్ సెంటర్ నందు శిక్షణ పొందిన ముగ్గురు విద్యార్థులు గల్ప్ లో ఉద్యోగాలు పొందారు. ఉద్యోగాలు పొందిన వారిలో ఈపూరి హరీష్ బాబు (గుంటూరు), షేక్ వలీ (బాపట్ల), చింతా హరినాధ్ ( యలమంచలి) ఉన్నారు. వీరంతా ఎలక్ట్రిషియన్ కోర్సులో ఉచితంగా శిక్షణ పొందటంతో పాటు టిడిపి ఎంపవర్మెంట్ సహకారంతో ఉద్యోగాలు పొందారు. ఈ సందర్భంగా బిసి వేల్ఫేర్ మంత్రి సవిత బుధవారం ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం లో జరిగిన ఒక కార్యక్రమంలో వీరికి జాబ్ ఆఫర్ లెటర్స్ అందచేశారు. విద్యార్థులను ఆమె అభినందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరు నిలబెట్టేలా పని చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టిడిపి బ్రాహ్మణ సాధికారిత విభాగం స్టేట్ కో ఆర్డినేటర్ కె బుచ్చిరాంప్రసాద్, బిసి వేల్పేర్ విభాగం కో ఆర్డినేటర్ వి గురుమూర్తి, టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్ ట్రైనింగ్ కో ఆర్డినేటర్ యామిని, ట్రైనర్లు వి భాను, అధికారి, ఉమామహేశ్వరి ప్రతినిధులు డివి రావు మరియు డోమ్నిక్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News