Breaking News

ఎం.పి కేశినేని శివ‌నాథ్ ను క‌లిసిన టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ప‌ల్లా శ్రీనివాస్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టిడిపి రాష్ట్ర అధ్య‌క్షుడు గాజువాక ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీనివాస్ శ‌నివారం గురునాన‌క్ కాల‌నీలోని ఎన్టీఆర్ భ‌వ‌న్ లో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ప‌ల్లా శ్రీనివాస్ కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. పల్లా శ్రీనివాస్ పుష్ప‌గుచ్ఛం అందించి ఎంపి కేశినేని శివనాథ్ ను ఆత్మీయంగా కౌగిలించుకున్నారు.అనంత‌రం పల్లా శ్రీనివాస్ కు పుష్ప‌గుచ్చం అందించి శాలువాతో ఎంపి కేశినేని శివనాథ్ స‌త్క‌రించారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు టిడిపి పై వైసిపి అధ్యక్షుడు జ‌గ‌న్ చేస్తున్న దుష్ర‌చారం పై, రాష్ట్రాభివృద్దికి కేంద్రం నుంచి అందుకోవాల్సిన సాయం పై చ‌ర్చించుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *