Breaking News

రైతుల‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇప్పించేందుకు కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నాగపూర్‌-విజయవాడ 163(జి) గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు, తాము ఇచ్చిన భూముల తాలుకా న‌ష్ట‌ప‌రిహారం ఇప్పించాల్సిందిగా విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)ను క‌లిశారు. ఖ‌మ్మం నుంచి విజ‌య‌వాడవ‌ర‌కు నిర్మించే నాగపూర్‌-విజయవాడ 163(జి) గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే మార్గంలో భూములిచ్చిన మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం జి.కొండూరు మండ‌లం క‌వులూరు గ్రామానికి చెందిన రైతులు గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్లమెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో శ‌నివారం ఎంపి కేశినేని శివ‌నాథ్ ను క‌ల‌వ‌టం జ‌రిగింది. భూములిచ్చి న‌ష్ట‌ప‌రిహారం కోసం ఎన్ని ఇబ్బందులు ప‌డుతున్నారో వివ‌రించారు.

గ్రామంలో 170 మంది హైవే నిర్మాణం కోసం భూములివ్వ‌గా వారిలో 60 మంది మాత్ర‌మే న‌ష్ట ప‌రిహారం అందింద‌ని తెలిపారు. మిగిలిన 110 మందిలో 20 మందికి మాత్ర‌మే అవార్డ్ కాపీ వ‌చ్చింద‌ని…మిగిలిన 90 మందికి అవార్డ్ కాపీ కూడా రాలేద‌ని తెలియ‌జేశారు. వీరిలో కొంత‌మంది భూముల్లో రాళ్లు పాత‌టం జ‌రిగింద‌ని..అయితే వారి పేర్లు గెజిట్ లో న‌మోదు కాలేద‌న్న విష‌యం వివ‌రించారు.

ఈ విష‌యం పై ఎంపి కేశినేని శివ‌నాథ్ స్పందిస్తూ సంబంధిత అధికారుల‌తో మాట్లాడి అంద‌రికీ న‌ష్ట‌ప‌రిహారం అందిచేలా చూస్తాన‌ని హామీ ఇచ్చారు. అనంత‌రం క‌వులూరు రైతులు ఎంపి కేశినేని శివనాథ్ ను శాలువాతో స‌త్క‌రించారు.

ఈకార్య‌క్ర‌మంలో టిడిపి రాష్ట్ర నాయ‌కులు జంపాల సీతారామ‌య్య‌, భోగినేని ర‌వీంద్ర రావు, రైతు సంఘం నాయ‌కుడు చెరుకూరి వేణుగోపాల్, భోగినేని సూర్య ప్ర‌కాష్, బుడ్డి మ‌ల్లేశ్వ‌ర‌రావు,చెరుకూరి సుబ్బారావు, బొర్రా అశోక్ ల‌తో పాటు క‌వులూరు రైతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌పై సీఎం సానుకూలం : మంత్రి నారాయణ

-సీఆర్‌డీఏ కమిషనర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శితో వెంటనే మాట్లాడుతా : నారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *