Breaking News

సూపర్ మార్కెట్లలో నాణ్యమైన కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రత్యేక కౌంటర్లు – తహశీల్దార్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ధరల స్థిరీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సూపర్ మార్కెట్లలో కూడా నాణ్యమైన కంది పప్పు, బియ్యం విక్రయాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు మచిలీపట్నం తహశీల్దార్ కె విజయ్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దేశవాలి కంది పప్పు కేజీ రూ.160/-లకు, సోనా మసూరి బియ్యం కేజీ రూ.48/-, సోనా మసూరి స్ట్రీమ్డ్ బియ్యం కేజి రూ.49/-లకు విక్రయిస్తున్నట్టు తెలిపారు. డీమార్ట్, విశాల్ మార్ట్, రిలయన్స్ మార్ట్, వాణిశ్రీ జనరల్ స్టోర్స్, NR జనరల్ స్టోర్ లో ఈ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే రైతుబజార్ లో ప్రత్యేక కౌంటర్ ద్వారా విక్రయాలు ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు 5.3 టన్నుల బియ్యం, 2.3 టన్నుల కంది పప్పు విక్రయాలు జరిగాయన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *