Breaking News

అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో భేటి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
అసెంబ్లీలో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు త‌మ కూట‌మి ఎమ్మెల్యేల‌కు దిశ నిర్దేశం చేశారు.. అసెంబ్లీ కమిటీ హాలులో ఎన్డీఏ సభ్యులు సమావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన విధివిధానాలపై ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. గడిచిన ఐదేళ్లు వైసీపీ పెట్టిన ఇబ్బందులని సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యేలు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. ఈ విషయాంపై చట్ట ప్రకారం ముందుకెళ్దామని, చట్టం తన పని తను చేస్తుందంటూ సీఎం చెప్పారు. సాండ్ పాలసీలో ఎవరు జోక్యం చేసుకోవద్దంటూ సూచించారు. కలిసికట్టుగా అందరూ కలిసి పనిచేయాలంటూ దిశా నిర్దేశం చేశారు.

ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ కవ్వింపు చర్యలకు పాల్పడద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో వేసే కమిటీల్లో అన్ని పార్టీలను కలుపుకోవాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *