అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. జూలై 26 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. స్పీకర్ అయన్న పాత్రుడి అధ్యక్షతన జరిగిన బీఏసీ ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్,జనసేన నుంచి మంత్రి నాదేండ్లమనోహర్, బీజేపీ నుంచి విష్ణుకుమార్ హాజరయ్యారు. వైసీపీ నుంచి ఎవరూ హాజరుకాలేదు. అన్ని శాఖలపై సభలో శ్వేత పత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే ఓట్ ఆన్ అకౌండ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు.
Prajavartha Online Telugu News