మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు అవలంబించి మంచి దిగుబడులు సాధించి, అధిక ఆదాయం పొందే విధంగా జిల్లాలో పొలంబడి (ఫార్మర్ ఫీల్డ్ స్కూల్) రైతు క్షేత్ర పాఠశాల కార్యక్రమాలు నిర్వహించాలని, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మీకోసం సమావేశ హాలులో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో GAP ( Good అగ్రికల్చర్ ప్రాక్టీస్ )పొలంబడి కార్యక్రమాలపై జిల్లాస్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల మార్గదర్శకాలు సూచనలు పాటిస్తూ విత్తనం నుండి విక్రయం వరకు అవసరం మేరకు మాత్రమే ఎరువులు పురుగు మందులు వాడుతూ పంటలు పండించాలన్నదే GAP ( Good అగ్రికల్చర్ ప్రాక్టీస్ )పొలంబడి ముఖ్య ఉద్దేశం అన్నారు. 233 పురుగు మందుల అవశేషాలు 7 పారామీటర్లలో NABL ల్యాబ్ లో పరీక్ష చేసి సర్టిఫికెట్ ఇస్తారని తెలిపారు.
మేలైన యాజమాన్య పద్ధతులతో అన్ని రకాల పంటలలో( ప్రత్తి పంట తప్ప) 14 వారాల పాటు రైతులకు శిక్షణ ఇవ్వటం, చివరిలో NABL ఎరువుల,పురుగు మందుల అవశేషాల శాతం పరీక్ష చేసి సర్టిఫికెట్ జారీ చేసే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు వారు పండించిన పంటలో ఎంత శాతం పురుగు మరియు ఎరువుల అవశేషాల శాతం ఉందో నిర్ధారణ చేసి FSSAI మార్గదర్శకాలకు అనుగుణంగా సర్టిఫై చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సేంద్రియ ఉత్పత్తుల సర్టిఫికేషన్ అథారిటీ వారు రైతులకు IND GAP సర్టిఫికెట్ ఇస్తారని,
ఈ సర్టిఫికెట్ ఆధారంగా రైతులు 135 దేశాలలో సొంతం గా రైతు లేదా రైతు గ్రూప్ లు వారి ఉత్పత్తులను నేరుగా మంచి ధరకు అమ్ముకునే అవకాశం వుందన్నారు. ఈ కాన్సెప్ట్ క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్లాలన్నారు.
జిల్లాలో పొలంబడి కార్యక్రమాలు రొటీన్ గా కాకుండా ముఖ్యంగా గ్రామంలోనే ఉంటూ సొంతంగా సాగు చేసే ఆసక్తిగల రైతులను గుర్తించి క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్ గా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాస్థాయిలో శిక్షణ పొందిన మీరు గ్రామస్థాయి వ్యవసాయ ఉద్యాన సహాయకులకు మార్గదర్శకం చేయాలన్నారు.
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్ పద్మావతి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో GAP పొలంబడిలో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు వ్యవసాయ శాఖ నాచురల్ ఫార్మింగ్ డిపిఎం K.పార్ధసారధి, గూడూరు, బంటుమిల్లి మండల వ్యవసాయ అధికారులు GV శివప్రసాద్, B శివరాం కృష్ణ ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారులకు శిక్షణ ఇచ్చారని, అదేవిధంగా గ్రామ వ్యవసాయ సహాయలకు వీరు శిక్షణ ఇస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సైంటిస్ట్ సుధారాణి, డిడి మనోహర్, ఏడి కే శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ ఏడీలు, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News